#


Index

చిత్రతరంగిణి

గెద" వని నిష్ఠురా లాడుతుంది మరొకతి. ఇలా ఒకదాన్ని త్రోసుకుంటూ మరొకతి ముందుకు వచ్చి చేతులు బార వేస్తూ ఒక్కొక్క తీరులో నిష్టురా లాడటం చూస్తే వాపోయే పల్లెపడుచుల వ్యవహార మెలాంటిదో కండ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. అంత నిష్ఠుర మాడుతున్నా బాలుణ్ణి చెరువు గోరి ఒకతిట్టు తిట్టటం గానీ యశోదా నందులను తూలనాడటం గానీ ఏమాత్రమూ కానరాదు. అది ఎంతటి ఔచిత్యమో చూడండి. మనోహరమైన ఆ పద్యాలిక్కడ ఉదాహరించటం కంటే ఎవరికి వారు చదువుకొని ఆనందించటమే మంచిది.

  కృష్ణుని బాల్యక్రీడలైతే ఇక ఎంత హృదయంగమమో ఎంత స్వాభావికమో చెప్పటానికి మాటలు చాలవు. చిత్రమేమంటే మాటలు చాలని ఆ భావాలనే మాటలలో పొదిగి చూపాడు మహాకవి ఎఱ్ఱన. ఇక్కడ ఒక విషయం మనవి చేయాలి. పోతన కూడా వర్ణించాడీ ఘట్టాన్ని భాగవతంలో. అయితే ఎఱ్ఱన ఆయన కన్నా ముందు వాడనే సంగతి మనం మరచిపోరాదు. వర్ణించటంలో మొట్టమొదటి చమత్కారమంతా చూపిన వాడెల్టాప్రెగడే. ఆ ఉపజ్ఞ Originality ఆయనదే. అంతేకాదు బాల చేష్టలు వర్ణించటంలో ఏ కారణంచేతనో కొంత ఆవేశం కొద్దీ పోతన కృష్ణుడిలో కొన్ని ప్రౌఢ చేష్టలు కూడా వర్ణించాడు. ఎఱ్ఱన అలా హద్దులు దాటి పోలేదు.

  ఇలా ఏకరువు పెడుతూ పోతే ఎంతైనా ఉంది. ఎన్నైనా సన్నివేశాలు ఉదహరించవచ్చు. స్థాలీపులాక న్యాయంగా చూపితే చాలు. ఆ దారిలో పయనించే సహృదయులైన పెద్దలు తమ పాటికి తాము ప్రయత్నిస్తే త్రవ్వి తలకెత్తుకో దగినన్ని రత్నాలున్నాయి. ఒక అక్షయమైన గనిలాంటి దాయన కవితా వైభవం. చిత్ర విచిత్రమైన రత్నరాసు లనేకం లభిస్తాయి మనకందులో అనర్హమైన ఆ రత్నాలలో ఒకానొక రత్నస్వరూపాన్నే మనమింత వరకూ పరీక్షించి చూచాము. అదీ స్థాలీ పులాకంగానే నని మనవి చేశాను. ఇక సెలవు.

జయంతి తే సుకృతినో రస సిద్ధాః కవీశ్వరాః నాస్తి యేషామ్ యశః కాయే జరా మరణజమ్ భయమ్

Page 86

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు