#


Index

చిత్రతరంగిణి

బ్రాహ్మణ క్షత్ర వైశ్య శూద్ర ప్రముఖుల నాల్గు వర్ణంబులకు జెందు నరులనెల్ల సవినయంబుగ రావింపు స్వయముగాగ నేగి తోడెమ్ము జనక మహీ మహేశు

అతడు సమస్త శాస్త్రముల నారియు తేరిన వాడు సత్యమే వ్రతముగ సల్పు వాడు రవి వంశ సగంధుడు బ్రహ్మవాది యౌ నతినికి తీసిపోడు వినయంబున వృత్తమునందు కాశికా పతి యతనిన్ స్వయంబు చని ప్రహ్వుడవై గొనిరావలెన్ జుమీ

వృద్ధుడు ధర్మశీలి మనుజేశుని మామ సపుత్రకంబుగా నిద్ధ చరిత్రు కేకయ మహీశుని దోడ్కొని రమ్ము - అట్టులే బద్ధ సఖుండు రాజునకు భవ్య గుణండగు రోమపాదుడా శుద్ధ చరిత్రు నంగవిభు జూచి రయంబున రా వచింపుమీ

సింధు సౌవీరముల రాజశేఖరులను మరియు సౌరాష్ట్రముల నేలు మనుజ పతుల ప్రాగు దగ్ధక్షిణా వా క్రపంచ నేత లెందరందర బిలిపింపు మిటకు వత్స

అనినన్ రాజుల నందరం బిలువ దూతానీకముం బుచ్చి త క్కిన రాజన్యుల మువ్వురం బిలువగా క్షిప్రంబ తానై చనెన్ ఘను డాతండు సుమంత్రు డట్టి యదనన్ కర్మాంతికుల్ వచ్చి యా మునిశార్దూలుని తోడ సర్వము సుసంపూర్ణంబుగా పల్కినన్

వారల తోడ వసిష్ఠుడు - మీరెట్టి యవజ్ఞ లేక మిగులగ ద్రవ్యా హారంబు లిడగ వలె నప చారంబట దొరలెనేని చంపును దాతన్

అంతం గొన్ని దినంబులైన దశ దిగ్భ్రాంతంబు లందుండి భూ కాంతుల్ భూరి హిరణ్య రత్నములు కాన్కల్ గొంచు నేతేర ధీ మంతుండాతడు వేగ నా దశరథ క్ష్మాకాంతునిం జూచి సా మంతుల్ వచ్చిరి వారి నందరను సమ్మానించి యేతెంచితిన్

Page 48

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు