#


Index

చిత్రతరంగిణి

కలదు మహత్తరంబయిన కార్యము నా కితడై ఘటింపగా వలసిన దంచు భానుకుల వర్ధను డాడగ రోమ పాదుడున్ మెలపున దెల్ప నమ్మునియు మేకొన భూపతి కౌగిలించి వీ డ్కొలుపగ నేగె యాజి మునికుంజరు దోడ్కొని రాజధానికిన్

ముందుగ పట్టణంబు నలుమూలల మార్జన సేచన క్రియా సుందరమైన వీధులను శోభిత చిత్ర విచిత్ర మాలికా బృంద విభూషితాట్టముల పేశల వాయు చలత్పతాకికా తుందిల రాజ గేహములతో వెలయింపగ నంపె దూతలన్ పురజను లెల్ల హర్ష రస పూర్ణములైన హృదంతరమ్ములన్ నరపతి యాన పట్టణము నల్గడ దీరిచి శంఖ దుందుభుల్ మొరయగ ఋశ్యశృంగ ఋషి ముంగలగా నగరంబు సొచ్చి భూ వరుగని కేలు మోడ్చి వరివస్యలు చేసిరి గారవంబునన్

అంత దశరథుడును తన యంతి పురికి నా తపోధను జేర్చి శాంతా సమేతు నర్చనము సేసి తన మనోభ్యర్చితంబు నపుడ ఫలియించి నంతగా హర్షమొందె

అంతఃపుర కాంతా జన - మంతయు శాంతా వధూటి నత్యుత్సాహ స్వాంతలయి ప్రీతి సేయగ- సంతోషమున న్వసించే సాధ్వియు నచటన్

జరిగెం బెక్కు దినంబు లిట్లు మధుమాసం బొక్కడేతేర నా ధరణీశుండు మఖంబు సేయ మది నుత్సాహంబు దీపింప నీ భరముం బూనగ ఋశ్యశృంగు వరియింపన్ వల్లెయంచున్ ఋషీ శ్వరుడా భూపతి తోడ ముందుగ మఖాశ్వంబున్ విసర్జింపుడీ

సరయూత్తర తీరంబున - విరచింపుడు యజ్ఞభూమి వివిధ పదార్థా త్కరములు సమకూర్పుడు స త్వరమున నాతండు మంత్రి వరులను బనిచెన్

Page 46

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు