#


Index

చిత్రతరంగిణి

ఇచటి వలె నచట నున్నవి - రుచిరములగు మూలములును రుచిరఫలంబుల్ సుచరిత్ర రమ్ము మాతో - నచటికిని నని తోడి తెచ్చి రంగన లతనిన్

వచ్చెనొ లేదొ యా తపసి వర్షము హర్షదమై ప్రజాళికిన్ హెచ్చుగ నెల్లెడం గురిసె - నెంతయు వేడుక రోమపాదుడున్ గ్రచ్చఱ భక్తితో నెదురుగా జనుదెంచి సపర్యలిచ్చి తో ర్తెచ్చి యొసంగె నాతనికి దేవిగ శాంతను కన్యకా మణిన్

శాంతమగు మానసము తోడ శాంత నతడు పరిణయంబాడి సుఖభోగ పరత జెంది రాజు ప్రజలును తను సదా పూజ సేయ కాపురంబుండె లేకెట్టి లోపములును

అని చెప్పి సుమంత్రుండు విరమించిన

సంతోషాతి శయంబునన్ దశరథ క్ష్మాకాంతు డాత్మీయ శు ద్ధాంత స్త్రీలు నమాత్యులున్ బలసిరా తత్తన్నదీ పట్టణ ప్రాంతంబుల్ గమియించి యంగ విషయో పాంతంబు సేరంగ వృ త్తాంతంబున్ విని రోమపాదు డెదురై యాతిథ్య సత్కారముల్

కావించి నగరికిన్ గొని - పోవగ నట ఋశ్య శృంగ ముని పుంగవుశాం తా వల్లభునిం గని పూ - జా విధి యొనరించె నతడు సంతుష్టుడు గాన్

అప్పుడు రోమపాద విభు డల్లుని జూచి యితండు నాకు చి న్నప్పట గోలె బాల సఖుడంచు వచించి మహోప చారముల్ గొప్పగ జేయ నుండి యొక కొన్ని దినంబులు శాంత తోడ నో యప్ప మదీయ రాజ్యమున కంపగ వేడెద నీ మునీశ్వరున్

Page 45

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు