రూపమును రూపమున కనురూపమైన వేషమును వేషసముచిత విభ్రమంబు గలుగు యౌవత మెట్టి మార్గముననైన నతని మది దోచుకొనుట తథ్యము నృపాల
అని భూమీపతి సమ్మతిం గొని యమాత్య శ్రేష్ఠులున్ సద్ద్విజుల్ వనితా బృందము నంప వారును కృత ప్రస్థానలై యావనా వని తద్దర్శన కాంక్ష నుండగను దైవ ప్రేరణన్ జేసి యా మునిబాలుం డలవోక నచ్చటికి రా మోదాతి రేకంబునన్
ఆడుచు పాడుచు నాతని - గూడగ జని యెవడవీవు క్రుమ్మరి యెదవీ వోడక యిక్కాననమున - బాడబ యని పలికి రతడు బమ్మెర వోవన్
మునుపొక నాడు నట్టి నవమోహన చారుతనూ విలాసినీ జనమును జూచియున్ దెలియ జాలని గోల యతండు వారలం గని తన వృత్తమున్ దెలుపగా దల పేర్పడ పల్కె నిట్టులో ముని వరులార ఔరసుడ పుత్రుడ నేను విభండ కర్షికిన్
ఇదె షాద్యం బిదె యర్ఘ్య మీయదె ఫలం బింపార సేవింపుడీ ఇదె మూలంబని పూజసేయ నపుడా యింతుల్ విభండర్షియే యధనన్ వచ్చునొ యంచు భీతలయి రుచ్యంబైన భక్ష్యంబులన్ కుదురైనట్టి ఫలంబులన్ మరల గైకొమ్మంచు నందించుచున్
నెట్టిక సీల పోవలయు నేమము సల్పగ నంచు నాతనిన్ గట్టిగ గౌగిలించి చనగా నతడున్ మనంబులో నిట్టి ఫలంబు లేనెరుగ నెప్పుడు నంచు భుజించి యేకతం బట్టిటు సంచరించి హృదయంబొక లాగయి దైన్యమేర్పడన్
రెండవ నాడు వారు విహరించిన చోటికి నేగుదేర యండజ యాన లందరు రయంబున నాతని జేరవచ్చి వైభండక మాకునుం గలదు భద్ర తరంబగు నాశ్రమంబు - నీ వుండగ వచ్చు - వచ్చు సమయోచిత కృత్యము లెల్ల సల్పగన్
Page 44