మీరు సమస్త ధర్మముల మేలును కీడును లోక వృత్త వి స్తారము లెన్ని యన్నియును చక్క నెరింగిన వారు - గాన నా నేరమి జేసి యేర్పడిన నిష్ఠురమైన యవగ్రహంబు నే తీరున దాటగా నగునొ తెల్పుడు పాచిత మెద్ది దీనికిన్
అనిన శ్రుతి పారగులు విప్రు లతని జూచి ఏ యుపాయంబుచే నైన నిపుడ నీవు ఋశ్యశృంగుని బిలిచి యవశ్యముగను శాంత నొసగి వివాహంబు సలుపవలయు
అన విని రాజు దీని నెటులౌను ఘటింపగ నాత డెట్టి సా ధనమున నస్మదీయ సవిధంబునకుం జనుదెంచనో గదా యనుచు నమాత్యులన్ ద్విజుల నంపగ జూడగ వారకామినీ జనములు తక్క నొండొరులు చాలరు తేరగ నంచు వారనన్
అట్లె కానిండటంచు వేశ్యాంగనలను హావ భావాభినయ కళా శేవధులను అనిచి వారలతో నాత డరుగుదేర తీర కాటక మాత్మ కుమారి నొసగె
ఆ ఋశ్యశృంగుడే నీ - కారాధ్యుడు వానివలన నగు సంతతి నీ కో రాజ తిలక మున్నొక - మారు వచించెను సనత్కుమారుడు దీనిన్
రోమపాదుని తోడ పురోధసుండు సచివులను గూడి ఇట్లని చాటి చెప్పె నొక యుపాయంబు నిరపాయ మూహ కందె నాలకింపుము దాని నీ వవని నాథ
వనచరుడు తపో నిష్ఠుం - డనభిజ్ఞుడు భోగములకు నంగనలకు నా మునిబాలు డతని గణికా జనములు చనిరేని తేర జాలుదు రిటకున్
Page 43