దశరథుని యజ్ఞ దీక్ష
ఆ రాజన్యుడు సత్య సంగరుడు దానా భోగ కల్పాగుడై చారావేక్షిత కార్యుడై యెపుడు సత్సాంగత్యముం బాయకే పారావార పరీత భూవలయమున్ బాలించు ధర్మార్థ కా మారంభంబుల నప్రమత్తుడయి అన్యాయంబు వర్ణించుచున్
చనియెన్ మాసము లబ్దముల్ శత సహస్రం - బైన నా భూమిపా లునకున్ గల్గక పోయె నాత్మజ ముఖా లోక క్రియా భాగ్య - మా యన చిత్తంబున నశ్వమేధమును జేయన్ నిశ్చితారంభుడై తనకుం గూర్చెడు మంత్రులెల్ల ననుమోదంబున్ నివేదింపగన్
పిలువగ బంచె మంత్రులకు పిన్నయు బుద్ధికి పెద్ద యైన ధీ కలితు సుమంత్రునిం బనిచి కార్య విధిజ్ఞ వసిష్ఠ వామదే వుల - మరి సర్వ ఋత్విజుల- బోరన వచ్చిరి వారలెల్ల న కొలువున - కంత వారి గనుగొంచు నతండు కృత ప్రణాముడై
తనయుం డొక్కడు కల్గలేదను మనస్తాపంబు నానాటికిన్ ఘనమై పూనితి నశ్వమేధమను యాగంబేను గావింపగా వినిపింప న్వలె మీరు శాస్త్ర విధి సంవేదుల్ తదీయ క్రమం బనుమానింపక యెట్లు చేసిన మదీయా భీష్ట
మీడేరెడున్ అని పలుక వసిష్ఠాదులు మనమున హర్షించి మంచి మాట నృపాలా! మును సరయూ తీరంబున నొనరింపగ బంపు మధ్వ రోచిత భూమిన్
సంభారంబులు సంగ్రహింపుము మఖాశ్వంబున్ విసర్జింపుమా రంభం బియ్యది పుత్రహేతువును ధర్మ్యంబౌట నీవాంఛయున్ సంభావింప నవశ్యమున్ సఫలమౌ- శంకింపగా బోకుమో యంభో రాశి పరీత భూభరణ యం చామంత్ర ణం జేయగన్
Page 41