జగమిది గడ్డిపోచకును చాలదు - దీని దలంప నేల - నీ వగపడు సూక్ష్మముం దెలుప నట్టి మతంబును నాకు నేల - నే పగలును రేయి గోరునది బ్రహ్మ పదాను భవంబె - ఇంటిలో మగడొక డుండెనేని ఒక మాటయె చాలును హెచ్చరింపగన్
కంటివొ లేదొ నీదయిన కాయమె చిత్తమె పో శనైశ్చరుం డింట మెలంగు దొంగలయి యేచెడు నిన్నటు గాన కీవు నీ కంటకుడా శనైశ్చరు డొకండెటనో గలడందు వెక్కడో నుంటకు నీ విశృంఖలపు టూహల ధాటి కతండు నిల్చునే
పురములు గ్రామము ల్నదులు పుష్ప వనంబులు సర్వమున్ వృధా అరసితి నందమైనవియు నంద విహీనము లన్నియున్ వృధా తొరగును సర్వమున్ కడకు త్రోయుము నీ మతమున్ ప్రపంచమున్ పరమగు తత్త్వ మొక్కటియె బాగని చిత్తమునన్ భజింపుమీ
ఎవ్వడు నీకు నీ జగదధీశ్వర భావము నప్పగించెనో ఎవ్వడు భోగ భాగ్యముల నీయక నన్నిటు లాగి వైచెనో అవ్విభు డిచ్చు పాప పరులందరకున్ కనకాంబరంబులన్ అవ్విధి గాని వారలకు నందర కిచ్చు దిగంబరంబులన్
ఇంకను నీవు బొమ్మ వలె నేల తపించెదు పేరు కోసమై ఇంకను కార్య భారముల నేల కృశించెదు పేరు టాసమై ఇంకక మున్నె జీవనపు టేఱు రసంబు గ్రహింపు మల్లదే కంకులు కోయ వచ్చినది కాలము పండక యున్న నొప్పునే
Page 40