#


Index

చిత్రతరంగిణి

వయసొక మంచు గడ్డ - మన వాంఛలు గ్రీష్మ రవి ప్రతాప సం చయమటు చూచుచుండ నిముసంబున నీరయి జాలు వారెడున్ రయమున సల్పు యత్నము కరంగక మున్నొక కాసు చేతలే కయె తిరుగాడ నేమగు సుఖంబు పరంబను సంత లోపలన్

అమృతము చిందినన్ జలద మాఱడి పోవునె గాని వట్టి మ్రో డమరుచునే ఫలంబు - లనయా భిరతున్ జతగూడ నట్లె నీ కమరదు సత్ఫలంబు - లెటు లబ్బును గానుగ నాడి తీసినన్ శ్రమ యగు గాని తీయనగు చక్కెర దక్కునె చొప్ప దంటునన్

ఇనుమున బుట్టు ఖడ్గ మది యెట్లు మృదుత్వము గాంచు - దుష్టుడె ట్లైనయును సద్గుణంబు - మన మెన్ని విధంబుల బోధ చేసినన్ వనముల భూములన్ గురియు వర్షము భూముల మాడ్కి పండునే వనములు - వేని లక్షణము వానిదె ఈ సువిశాల సృష్టిలో

షేక్ సర్మద్

దైవమ! తృప్తి పేరిటి నిధాన మొసంగి యనుగ్రహింపు మీ జీవిత మెల్ల ఆశలకె చిక్కి కృశించె - నిహంబు కంటె సౌ ఖ్యా వహమౌ పరంబె యను నార్యుల వాక్యము తోచె నిక్కమై ఈవిధి లాభ నష్టముల నేను ప్రతిక్షణ మెంచి చూచినన్

లోకుల సాయ మంచు మదిలో దలపోయకు భాయి తానుగా నీకొక - డేని తోడ్పడగ నేరడు - నీడ నొసంగ నేర్చునే ఆకులు లేని వృక్ష - మడి యాసయె దుఃఖము - తృప్తియే సుఖం బీ కమనీయ సూక్తి నొక యింతయు నేమర కాచరింపుమీ

Page 39

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు