ఒక విహగం బురిం దగిలి యుక్కిరి బిక్కిరి గాగ జూచి వే రొక విహగంబు ధాన్య కణ మూరక వచ్చిన ముట్టబోవ దీ ప్రకటిత సత్యముం దలచి పంచ జనుండు సజాతి దేహభృ న్నికర గతోప తాపముల నేర్వవలెం దగు నీతి పాఠమున్
కనుమా అభ్రము వాతమున్ జలము నాకాశంబు చంద్రార్కులున్ నిను నీ జీవనమున్ భరించు కృషిలో నిర్మగ్నులై యుండగా గనుచున్ జీవిత లక్ష్య సిద్ధికయి నీ కర్తవ్యమున్ విస్మరిం చినచో వ్యర్థము గాదె వాని దగు సాచివ్యంబు నీ జన్మమున్
ఎవరే నన్నది యెట్టు లుండు నని తామేదేది ప్రశ్నింపగా నవునే వర్ణన సేయ నిర్విషయమౌ నద్దాని వా క్రువ్వగా అవలోకింప ప్రియా సమర్పిత మనః ప్రాణేంద్రియో పాధి సం వ్యవహారుం డెటులోపు నోరు దెరవన్ వ్యాహారముం జేయగన్
మా తలపోత లూహలును మా యవబోధము మా వితర్కపున్ రీతుల కందనట్టి అతిరిక్త గుణాకర! నిన్ను గూర్చి ని ష్ణాతులు చెప్ప గ్రంథములు చాటగ వింటిమెగాని యెంతకున్ చేతయె గాదు మాకు నిను జేరగ చూడగ మాటలాడగన్
ఓ యఖిలేశ మా తలపు లూహల కందని దూరవాసి! ని న్వేయి విధంబులన్ శ్రుతుల వింటిమి వర్ణన సేయ - నైన మా ప్రాయము చెల్లె గాని కనుపట్టదు సుంతయు నీ స్వరూపమే చాయల - శైశవం బెటులు సాగెనొ వార్ధక మట్లు సాగెడున్
ఎవ్వడు వచ్చినం దనకు నిమ్ముగ గేహము గట్టు క్రొత్తగా నవ్వల దాని వేరొకని కర్పణ చేసి తొలంగు - వాడు దా నవ్వలి వాని కిచ్చి చను - నందరు పోయెడు వారె గాని లే డెవ్వడు గాని తాను రచియించిన గేహము గొంచు పోవగన్
Page 38