#


Index

చిత్రతరంగిణి

ఆకృతులెల్ల మిథ్య మఱి యర్థమె తథ్య మదే ధరించి ఈ యాకృతులెల్ల నిట్లు సచరాచర రూప మహా ప్రపంచమై నీకును నాకు గానబడు నిత్యము కావున దీని వేరుగా గాక తదేక రూపముగ గాంచుటయే రహదారి ముక్తికిన్

నీవొక పెద్దగా దలచు నీరజ బాంధవ మండలంబు సం భావన సేయ నొక్కణువు పాటియు జేయదు దానిలో - విమూ ర్ఛావహ మైన యంబుధియు నందొక బిందువు గాదసత్యముల్ ప్రోవులు ప్రోవులైన నవి పోలునె సత్యము తోడ డీకొనన్

ధీయుత మైన చెప్పు మిది దేహము నీ- కటుగాక యున్న నీ కేయన నేల జంతువుల కేనిది గల్గక పోదు - దాన నే మాయె - అక ల్గలందులకు నాయువు దీరక మున్నె మేలుకో వోయి ! సదధ్వ గామి - ఎపుడో కను మూయుట ఖాయమే గదా

ఏ జతనంబు లేక వరియించునొకో ధన లక్ష్మి నిన్ను - నే బీజము నాటకే మనసు పెట్టిన చేతికి వచ్చునే ఫలం బీ జని సార్ధకం బగుట కిచ్చ జనించిన నిప్పుడే సమా యోజిత సర్వ యత్న విజయో త్సహనుండవు గావలెం జుమీ

మంచిగ నుండు వాని కడ మంచిగ నుండుము - చెడ్డ గాగ క న్పించిన వాని కీవు కని పింపుము చెడ్డగ - రాక్షసుండు క న్పించడు నీకు రాక్షసుని వేషము లోపల దాగి నిన్ను బా ధించెడు వాడు మానవుడె- దీని దలంచి మెలంగు మెప్పుడున్

కొన్ని దినంబు లేది మది గోరిన తీరుచు నుండ గర్వ సం ఛన్నుడవై మెలంగి - మరి కొన్ని దినంబు లదృష్ట హీనతన్ భిన్నుడవై కలంగి - ఇటు కీడ్పడి పోవగ కాల మింక నీ కెన్నడు దీని వీడి యటు వీక్షణమున్ పరపం దలంచితో

Page 37

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు