#


Index

చిత్రతరంగిణి

ఆ శత్రు ప్రవిదారణ ప్రఖరమౌ హస్తంబు నా దివ్య వా క్కోశా విష్కరణ ప్రవీణమగు సంగుళ్యగ్ర మా జీవకో ట్యాశా జ్యోతి రపాంగ వీక్షణము నేమై పోయె - కన్నట్టదే లేశంబైన - శ్మశాన పాంసు కణికా లీఢంబులై రూపరన్

జాగా యొక్కెడ లేని వానికి ప్రపంచం బెల్ల వర్తింపగా జాగాయే - యెట రాత్రి యైన నదియే సంవేశన స్థాన మే భోగం బక్కర లేనివాని కఖిలంబున్ దోచు భోగ్యంబుగా బాగా దీని యథార్థమున్ తెలియుటే భాగ్యంబు దర్వేశికిన్

చాలా కాలము పట్టు పండుటకు కచ్చా కాయ - సూఫీలు సా ఫీలే కావలెనన్న వారికిని తర్ఫీ దెంత భావ్యంబొ నీ వాలోచింపు - నమాజు కల్మయును రోజా నిన్ను కాపాడునే లోలత్వంబు పరిత్యజించి మది నాలోకింపు నీరూపమున్

రాజులేపేదలు మేము విన్నది నిజ ప్రాణంబులన్ నిల్పగా రోజున్ నాలుగు ముద్దలన్ మెసవుటే- ప్రొవైన రొక్కంబునే రాజుల్ కోరియు గోరి జేర్చిరను వార్తల్ విన్నదే లేదు రాజువ్వల్ వలె వెల్గి పోయి రెటకో రమ్మన్న చన్నట్లుగన్

ఆరయ భోగ భాగ్యములు నందము చందము గాదు స్థాన సం చారము గాదు - సర్వ జన సంస్తవ నీయ గుణంబె తెచ్చుబో పేరును పెంపు – నిప్పటికి పేర్కొను చుందురు గాదె అల్ల నౌ షీరు వనాఖ్యుడైన నృపశేఖరు ధర్మ పథ ప్రవర్తనన్

ప్రతి ద్వారంబును చొచ్చి చూచెద వహో రాత్రంబులున్ నీవు దు ర్మతివై యూరక పిచ్చి పట్టినటు లారాటంబుగా చొచ్చి చూ చితివేనిం గలదొక్క ద్వారమది నీ చిత్తంబులో దాగి - స న్మతివై చూడుము దాని చూడవిక పల్మారున్ మరే ద్వారమున్

Page 35

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు