#


Index

చిత్రతరంగిణి

తలపంబోకు ముపద్రవం బొకటి ప్రాప్తంబైన నింకెవ్వడో కలుగన్జేసె నటంచు - వేరెవడు కల్గంజేయు - దైవంబె యా తలపున్ వాని కొసంగకున్న - గనుమా ధానుష్కు డేయంగ ని న్నలయించున్ శర - మా శరమ్ము నెటులౌ నాక్షేపముం జేయగన్

ఈ దేశంబును కాలమన్ పటముపై నెన్నెన్నొ చిత్రంబు లా పాదించెన్ కనరాని హస్తమది - ఈ బాహ్యా కృతుల్ చూచినం గా దాంతర్యము చూచి పట్టగ వలెన్ - కాదేని చిత్రంబులం దేదో నీవును నొక్క చిత్రమయి పో కెంతేని తథ్యంబగున్

బంగరు వెండి గాదు మన భాగ్యము దాని గడించి పొందు వ్యా సంగము మానసంబునకు చాటెడు పాఠము జీవుడీ జగత్ ప్రాంగణ సీమ బాసిన పదంపడి సైతము పాయకుండు నా బంగరు వెండియున్ జగతి - ప్రాణుల నిట్టులె లోభపెట్టగన్

ధనమున్ కీర్తియు గేహ వాహ పదవీ తాపత్రయం బెల్ల వీ డిన వాడే సుఖియంచు లోకులకు చాటింపన్ సమర్థుండె యే జనుడున్ - వచ్చిన చిత్ర మేమనిన కాషాయంబు దండంబు దా ల్చిన వాడేని తదేక దృష్టియయి తా జీవించు నశ్రాంతమున్

అసలీ లోకమె నశ్వరం బిచట నీ ఆయుః ప్రమాణంబు దా నిసుమంతైనను నుండదీ నడుమ నీ వెన్నేని దుష్కృత్య సా హసముల్సేయగ జూతు - వింతకొక మాటైనన్ విచారింతె మా నసమం దెందరు పూర్వులీ పుడమి పైనం బుట్టి యెట్టేగిరో

Page 34

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు