షేక్ సాదీ
మానవుని జూచి జంతు సంతానమునకు అబ్బ దెన్నడు గాని మాటాడు విద్య మానవుం డేల యభ్య సింపంగ రాదు మౌన ముద్రా రహస్యంబు వాని జూచి
వలసినవి యెల్ల కూర్చిన వాడ విప్పు డుండుటకు గాను గృహ వస్తు భాండ చయము మఱచితివె తేపు పయనంపు మాట నీవు దాని కయినది సమకూర్ప దలప వేల
కాసు లేబదిలో నైదు కాసు లెపుడొ జారి పడిపోవ వెదకెదు దారియెల్ల ఏబదేడులలో నల్వ దేను చనియె నెట్లు చనియెనొ వెదకితే యెన్నడైన
ఉన్న యట్టుండి గురువుగా నెన్నికైతి గాని మోక్షంబునకు దారి కాన వీవు తెరు వెరుంగని వాడేటి గురుడు చెపుమ ఓనమా ల్నేర్వ వలయు శిష్యుండెగాక
పాటు పడకుండ కనడు సంపద నెవండు కష్ట పడు వాడె కాంచు భాగ్యమును జగతి కృషి యొనర్పక యెవ్వ డర్థించు సుఖము విత్తనము నాటకయె వాడు వెదకు ఫలము
రోజును రోజు మేము సగరొప్పెడు కార్యములందు నీదు న వ్యాజ కటాక్ష వీక్షణము పారగ జేయ ననుగ్రహింప రాదే జగదీశ! మీద నొకటేనియు కార్యము జీవితాన నే యోజ ఘటింప మేము కననోపని రోజది వచ్చు లోపలన్
Page 33