పదములు రాపడం దిరుగ బాల్పడి నాడవు నీవు - నేను కా ల్గదపక యింటి పట్టుననె కాలము పుచ్చితి - నీవు సర్వముం జదివిన వాడనంచు రభసంబుగ జాటితి వెల్లచోట్ల - నే మది మది నుండితిం జదువు మాట దలంపక భేదమేమిటో
కూజా యొక్కటి బేరమాడుటకు నంగుళ్యగ్ర భాగంబునన్ నాజూ కొప్పగ మీట - మాటవలె తన్నాదంబు వీతెంచె - నో వాజమ్మా! ఎటువంటి మూఢమతి వీ వాయించుటల్ చాలు పో కూజా యెయ్యది - అమ్ము వాడెవడు - కైకో జూచు వాడెవ్వడో
మే మొనరించు పుణ్యముల మేరకు స్వర్గ సుఖంబు లిచ్చి మ మ్మోమెద వేని కూలి యిది - ఉత్తవియే యిక నీ దయాళుతల్
ఎవడే గాని హృదంతరాళమున దా నీక్షించు జ్ఞానాత్మకం బవు నుద్గ్రంధము లోని పంక్తులు - క్షణంబైనన్ వృధా చేయ నో రువ తండు - జగద్రహస్యమును నేర్చున్ జూడ - కాదేని యే వ్యవహారంబును మాని శీధురస పానాసక్తుడై వర్తిలున్
ఈ కాలంబున నేజనంబులను గానీ స్నేహ పాత్రంబుగా నీకున్ నాకును చూడగా దగదు సూ- నేస్తంబు దౌ దవ్వులన్ గైకో జూచుట మేలు - ప్రాణ సఖుడన్ భావంబుతో నెవ్వనిన్ చేకొన్నాడవొ వాడె నీ కహితుడై చేడ్పాటు కావించెడున్
నీవొక మంచి మాట విన నేర్చిన జెప్పెద నీకు నాకు నీ జీవితమన్న దొక్క త్రుటి సేపయినన్ నిజమో అబద్ధమో భావము దీనిపై నిడి యభంగుర మైన పదంబు దవ్వులం ద్రోవగ జూచు టెంతయును దుండుడుకైన విచేష్టితంబగున్
Page 32