కారణ కార్య భావ మొక కర్కశ పాశము దాని త్రెంపగా నేరడు బ్రహ్మ యైన - మును నీ వొనరింపని దెట్టు వచ్చి నిన్ జేరు - నొనర్చినట్టి దెటు చెందక పోవును - రెండు హేతువా దారభటీ ప్రవాహమున కాగని కట్టలె వేంకటేశ్వరా
ఉన్నదొకే పదార్థ - మది యొండెడ లేదు మదాత్మయే - తదా చ్ఛన్నము గాని తావు మరి సావియు లేదు - తదేక రూపమై. యున్నది యీ సమస్త జగ - మూరక యున్ననె చేతికబ్బు నీ కన్నదె సర్వ విద్యలకు నాదియు నంతము వేంకటేశ్వరా
సూఫీ వేదాంత సారము ఉయర్ ఖయ్యాము
అవధానంబున నుండు మాంతర జగద్వ్యాప్తిన్ బహిర్లోక సం వ్యవహారంబున మౌనివై మెలగు మవ్యాసంగితన్ జిహ్వ యున్ శ్రవణంబున్ నయనేంద్రియంబును పనుల్ సాగించుచో - జిహ్వయున్ శ్రవణంబున్ నయనంబు లేనియటు లశ్రాంతంబు భావింపుమీ
ఎఱుగను కాల చక్ర మిది యెందుల కిట్లు పరిభ్రమించునో ఎఱుగను దుఃఖవాహినుల నీదుట కేమి కతంబొ - యోగినై తరుచుగ జూచితిన్ హృదయ ధామము లోతుల నాయు వూరకే పరచెడు గాని నాకు గనుపట్టదు సృష్టిరహస్య మింతయున్
కొందఱు నన్ను మధ్య రస ఘూర్ణిత మానసు డంచు తిట్టగా కొందఱు తత్త్వ మార్గ గతి కోవిదు డంచు రథంబు పట్టగా అందుకు నిందుకున్ వగపు నందను హర్షము చెందబోను చందము నేనెరుంగుదును స్వాంతమునన్ జగమే మెరింగెడున్
Page 31