చదువుల బేరగాడు - గుణసంపద బాసిన పేదవాడు దు ర్మద మదవారణైక గతి మావటి వాడు అవాంఛనీయపుం బదవుల బిచ్చగా - డఖిల పాప భరంబును మోయు కూలివా డిదియది గాడు నేడభిన యించెడు పాత్రలు వేంకటేశ్వరా
చెడుగును మంచి నేర్పరుచు శేముషి దైవ కృత ప్రసాదమై విడుదల జేసె పాశవ నివేశము నుండి మనుష్య సంతతిన్ పెడతల బట్టి ఇప్పుడది వెండి యధో భువనాండ సీమలం బడ - నిక నేమి చెప్ప నరభావ మహత్వము వేంకటేశ్వరా
నలువ కులాలు భంగీ భువనంబులు వాన- నధోక్షజుండు ని చ్చలును దశావతార బహుసంకట మార్గములన్ చరింప దోః కలిత కపాల పాత్ర పుటికన్ ధరియించి హరుండు బైక్షమున్ సలుపగ - దీని నేమి యని చాటవలెస్ మరి వేంకటేశ్వరా
ఇహమున నీశ్వరేచ్ఛ - పురుషేచ్చ పరంబున చెల్లునన్ మహా మహిముల సూక్తిలోన గల మర్మ మెరింగి స్వకీయ కార్య ని ర్వహణము సేయుచో నిహపరంబులు రెండు ఫలించు - కానిచో నిహమును లేదు - లేదు పరమెప్పుడొ వానికి వేంకటేశ్వరా
జీవిత మన్న నిత్య గతి శీల మహానది దాని మధ్యమే భావన సేయు మూఢు - డిరుపార్శ్యములన్ గమనింప బోడు పా ర్శ్వావని సీమ లాదియును నంతము సృష్టికి వానికే య స ద్భావము చెప్ప - మధ్యము నభావము గాదొకొ వేంకటేశ్వరా
కర్మకు జన్మ - జన్మకును కర్మ ఫలంబను మూల సూత్రపున్ మర్మ మెరింగె నేని - మరి మంచియు చెడ్డయు స్వర్గ మర్త్యముల్ శర్మము క్లేశమన్న యుగళంబున కర్ణ మెరుంగు - లేనిచో నోర్మి నశించి తత్తదనృతోప హతుండగు వేంకటేశ్వరా
Page 30