అందర చావు జూచియును ఆశలు చావవు తేజులట్టులా స్కందిత రేచిత ప్లుతముగా పయనించును- నేల యూబిలో డిందునొ మింటిపై కెగసి డీల్పడునో ఫలితం బెరుంగ మా కందని యూహ లీవె అరయన్ వలె దీనిని వేంకటేశ్వరా
అందరు రాజకీయ చతురానను లందరు వర్తకంపు రా బందులు నందరున్ పలుకు పాటవ మబ్బిన రామ చిల్క లే మందము - స్వార్థ చింతనల నందరు దోపిడి దొంగలైన యీ సుందర కాలలీల పరిశోధన కబ్బునె వేంకటేశ్వరా
శిష్ఠుడు దేనిజేయు నది చేయుదు రన్యులు సైత మంచు వి స్పష్టముగా నధోక్షజుడు చాటెను - గాని తదీయ వాక్య మీ భ్రష్ట యుగాన నేడు కనుపట్టదు - కూళలు పోవు త్రోవనే శిష్టులు కూడ నేగుదురు చేసెడి దేమిక వేంకటేశ్వరా
చదివియు వృత్తిలేక - బహు సంపద కల్గియు శాంతి లేక - నె మ్మది గల కాపురస్తుడయి భద్రత లేక విఘాతుక క్రియా స్పదుడయి శిక్షలేక - పరిపాలకు లయ్యును నీతి లేక - దు ర్మదమె గుణంబుగా నిపుడు మన్నన గాంచెడు వేంకటేశ్వరా
ఒకరు వచించు మాట విన నొల్లమి గొప్ప ఒకళ్ళ రంధ్రముల్ ప్రకటము సేయ గల్గుటయె పాండితి- జిత్తుల మారి చేష్టలం దికమక పెట్ట జూచుటయే ధీరత - ఏ వ్రత భంగమైన నా సుకమె యటన్న దొక్క పెను సూక్తిగ దోచును వేంకటేశ్వరా
సందియ మేల యీత డతి సాత్త్వికు డంచు దలంప నాతడే వందలు వేలు హత్యలకు వారసు - డీతని కంటె పేదవా డెందును లేడటంచు వచియింప నతండు శతైక వృద్ధి భా గ్యేందిర వల్లభుం - డివియె ఇప్పటి వింతలు వేంకటేశ్వరా
Page 29