#


Index

చిత్రతరంగిణి

వర్ణ విబేధ మొక్క విషవల్లరి దానిని ద్రుంచి జాతి నే కార్ణవ రీతి దిద్దవలె సంచును బుద్ధులు చెప్పువారే - నీ వర్ణ మదేమి యగ్రజుడవా అవరుండవ యన్నచో నికే యర్ణవమందు దూకవలె నయ్య వచింపుము వేంకటేశ్వరా

చెప్పుట గాదు చేయ వలె చేసెద నన్న మనీషి - చెప్పుటే గొప్పగ జూచు కాలమునకున్ మరి చేత కెంత దూరమే యప్పను పల్కరించిన మహాత్ముడు తానయి నట్లొ కళ్ళకున్ చెప్పుటకే జనించినటు చేయు హడావుడి వేంకటేశ్వరా

అంతయు రాజకీయ మయమై మయనిర్మిత ధర్మరా ట్సభా భ్యంతర సీమ వోలె నొకటన్న మరొక్కటి గానిపించు చే క్రంతకు నీడ్చునో - యెచట కాలు దిగంబడునో - శిరంబు లే కంతులు కట్టునో యనెడు కాలము వచ్చెను వేంకటేశ్వరా

పరమ విఘాతుక క్రియల పండి ధనంబు గడించి దానిచే పరిజనమున్ భరించి పిదపన్ పదవీ భ్రమ జెంది కన్ను మి న్నరయ కలోక దూషణల కన్నిటి కోర్చి మనుష్య రూపులై ధర వసియించు రాక్షసుల దందడి హెచ్చెను వేంకటేశ్వరా

వ్యసనము లెల్ల నాగరిక వైభవ మాసుర కృత్యముల్ మహా రసికత - బాధ్యతా రహిత రాజ్యము స్వర్గ పదంబు - నీతి స న్న్యసనమె సౌఖ్య జీవనము - నక్కల జిత్తులె వృత్తి గాగ న భ్యసనము చేయు వారి కెవరయ్య గురుండిక వేంకటేశ్వరా

త్రాగని వాడు నిత్య ధన దాహము జెందని వాడు సర్వదా వాగని వాడు పార్శ్వ జన వైభవ మోర్చెడు వాడు సంతతో ద్వేగము లేనివా డొకరి దృష్టికి రావలదన్నవాడెదో రోగము లేనివాడి పుడు రోసిన గానము వేంకటేశ్వరా

Page 28

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు