#


Index

చిత్రతరంగిణి

జీవిత మన్న నేమొ అది చేయు మహోన్నత బోధ యేమొ - ఈ భావమె యే యభాగ్యునకు పట్టదు - పక్షులయ ట్టితస్తతో ధావనమే జనించుటకు ధన్యతగా - పదవీ ధన ప్రథా సేవనమే గడింప దగు శేవధిగా గను వేంకటేశ్వరా

చదువుటయే భరంబనెడు ఛాత్రులు - విత్తముపై బుభుక్షయే వదలని శ్రేష్ఠు - లన్నిటికి పాల్పడు నీ ప్రజ - లేసమస్యలున్ మది జొరనీక క్రుమ్మరెడు మంత్రులు - నీ పద తీర్థ సేవనా విదళిత దోషు లౌదురని విందుము నిక్కమె వేంకటేశ్వరా

పట్టిన దెల్ల బంగరువు బాలిశు - డుత్తమ శీలి యేది చే పట్టిన మట్టియౌ - నమిత పాపి మనున్ బహుకాల - మెవ్వరో తిట్టిన యట్లు పోవ నతిధీయుతు - డీయది మాదు కర్మమో నెట్టన మాకు చూపగల నీదగు మాయయొ వేంకటేశ్వరా

ఎంతటి శక్తి యున్న - పరమేశుడ వైనను మంచి చెడ్డలం దింత వివేచనా గుణ విహీనత చూపుట నీ ప్రతిష్ఠకే కొంతకు కొంత లోప మొనగూర్చునొ యంచు భవత్పదాంకిత స్వాంతులమైన మాకె ఒక భావము తోచెడు వెంకటేశ్వరా

కవచము వైచి నీవు తము గాచెద వన్న అహంయు భావమున్ తవిలి యితోధికమ్ము లగు దారుణ కృత్యము లాచరింప - నె ట్లవును భరింప నీకయిన - అంత ప్రమాద మదేమి వచ్చె ఈ సవరణ ముందె చేసిన పసందుగ నుండదె వేంకటేశ్వరా

ఆలన పాలనన్న వరుదై పెడదారిని బడ్డ దొడ్డ దు ష్కాలము దాపురించినది - కర్ణుని చావున కెన్ని యన్ని యా భీల నిమిత్తముల్ ప్రజల పీలిచి పిప్పి యొనర్చి శుష్క కం కాళములం బొనర్చె నన కల్లయె గాదిది వేంకటేశ్వరా

Page 27

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు