#


Index

చిత్రతరంగిణి

  ఇక్కడికి పంచభ్రమలలో మూడు భ్రమలూ వాటి నివారణలూ నిరూపించాము. ఈ మూడూ జీవుడికి సంబంధించిన భ్రమలు. పోతే ఇక మిగతా రెండూ జగత్తుకు చెందినవి. జీవజగత్తులు రెండూ ఈశ్వరుడికి వేరని భావించటమే గదా వచ్చిన ఇబ్బంది. అలా భావించకుండా అంతా ఈశ్వర తత్త్వమే అది నా స్వరూపమేనని దర్శించటమే సకల సమస్యలకూ నివృత్తి. ఇందులో జీవుడి తాలూకు సమస్యలూ వాటి నివృత్తి జరిగిపోయింది. పోతే ప్రస్తుతం జగుత్తుకు చెందిన సమస్యలూ వాటి నివృత్తి జరగవలసి ఉంది. అందులో మొదటిది అంటే పెద్ద వరసలో నాలగవది జగత్కారణ రూపస్య వికారిత్వం చతుర్ధకః. జగత్తుకంతా కారణం ఈశ్వరుడని పేర్కొన్నామింతకుముందు. ఈశ్వరుడు కారణమైతే జగత్తు దానికి కార్యమవుతుంది. రెంటికీ కార్యకారణ సంబంధమెప్పుడు చెప్పామో అప్పుడొక చిక్కు వస్తుంది. కారణమనేది మార్పు చెందితే గాని కార్యంగా పరిణమించలేదు. ఒక ఘటమే ఉంది. ఘటమనేసరికది మృత్తిక నుంచి రావలసిందే. అలా వచ్చిందంటే అర్థమేమిటి. మృత్తిక అనేది అలాగే రావటానికి లేదు. తన రూపం మార్చుకొని ఒక లావుపాటి గుండ్రని పదార్ధంగా తయారు కావాలి. అయితేనే దాన్ని మనం ఘటమని పేర్కొనగలుగుతున్నాము. అప్పుడూ ఇప్పుడూ మృత్తికే అయితే ఇక కార్యకారణ సంబంధమనే మాటకర్థం ఏముంది. కాబట్టి కార్యమనేదొకటి ఏర్పడాలంటే కారణద్రవ్యం మార్పుచెందవలసిందే. ఈ మార్పుకే వికారమని పేరు.

  ప్రస్తుతం చైతన్య స్వరూపుడైన ఈశ్వరుడే జగత్కారణమని వాదించినపుడా ఈశ్వరుడు కూడా ఒక మృత్తికలాగా వికారిత్వానికి గురికావలసిందే కదా అని అంటే అది కూడా ఒక భ్రాంతేనని చాటుతున్నది ఈ మాట. దీనికి కనకరుచక దర్శనేన వికారిత్వ భ్రమో నివృత్తః అని దృష్టాంతంతో నివృత్తి చేసింది ఉపనిషత్తు. కనకమంటే బంగారం. రుచకమంటే దానితో తయారైన ఒక పాత్ర. ఇప్పుడా పాత్ర కార్యమనుకొంటే బంగారం దానికి కారణం. కార్యం తయారు కావాలంటే కారణ ద్రవ్యం మారాలని కదా వాదిస్తున్నావు. మంచిదే. మారటమంటే ఏమని అర్ధం. అంతకుముందున్న రూపం నష్టమయి దానిస్థానంలో మరి ఒక రూపం రావటమే కదా. ఇప్పుడు నష్టమయిపోయిందేమిటి. క్రొత్తగా వచ్చిందేమిటి. అప్పుడున్న బంగారమే ఇప్పుడూ ఉంది. ఆభరణం తయారయ్యేసరికది కనపడకుండా పోవటం లేదు. దాని మోతాదు దాని తూకం అప్పుడూ ఇప్పుడూ సమానమే. అలాంటప్పుడిక

Page 245

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు