#


Index

చిత్రతరంగిణి

పంచ భ్రమలూ - వాటి నివృత్తి

భ్రమః పంచవిధో భాతి స ఏ వేహ సముచ్యతే జీవేశ్వరౌ భిన్నరూపా - వితి ప్రాధమికో భ్రమః

ఆత్మ నిష్ఠం కర్తృ గుణం- వాస్తవం వా ద్వితీయకః శరీరత్రయ సంయుక్తో - జీవస్సంగీ తృతీయకః

జగత్కారణ రూపస్య - వికారిత్వం చతుర్ధకః కారణాద్భిన్న జగతః - సత్యత్వం పంచమో భ్రమః

పంచభ్రమ నివృత్తిశ్చ - తదా స్ఫురతి చేతసి బింబ ప్రతి బింబ దర్శనేన భేద భ్రమో నివృత్తః స్ఫటిక లోహిత దర్శనేన పారమార్థిక కర్తృత్వ భ్రమో నివృత్తః ఘటమఠాకాశ దర్శనేన సంగీతి భ్రమో నివృత్తః కనక రుచక దర్శనేన వికారిత్వ భ్రమో నివృత్తః రజ్జు సర్పదర్శనేన జగతః సత్యత్వ భ్రమో నివృత్తః

తదా ప్రభృతి మచ్చిత్తం బ్రహ్మాకార మభూత్ స్వయం నిదాఘ త్వమపీ తం హి తత్త్వజ్ఞాన మవాప్నుహి


  ఇది అన్నపూర్ణోపనిషత్తులో ఒకానొక సన్నివేశం. అష్టోత్తర శతోపనిషత్తులలో అన్నపూర్ణోపనిషత్తనేది ఒకటి. అన్ని ఉపనిషత్తులలో మాదిరే ఇందులో కూడా విషయమొక్కటే. జీవ జగత్తులను ప్రవిలయం చేసుకోవటం ద్వారా ఏకైకమైన బ్రహ్మతత్త్వాన్ని అనుభవానికి తెచ్చుకోవటం. అదే ఒక్కొక్క ఉపనిషత్తు మనకొక్కొక్క మార్గంలో బోధిస్తుంది. అందులో ఈ అన్నపూర్ణోపనిషత్తు బోధచేసే మార్గమేమిటో చూతాము.

  ఋభుడని ఒక గొప్ప బ్రహ్మవేత్త ఉండేవాడు. ఆయన దగ్గరకు నిదాఘుడనే మహర్షి వచ్చి నాకు బ్రహ్మవిద్య ఉపదేశించమని కోరుతాడు. అతడు యోగ్యుడని గుర్తించి ఋభుడాయనకు చాలా సులభమైన మార్గంలో ఇలా బోధ చేశాడు. నిదాఘా!

Page 240

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు