రాష్ట్రావతరణము
శ్రీశైల కాళ నగ దక్ష పురీ నివాసః
క్లేశాప నోదన పటిష్ఠ మహాట్ట హాసః
పాయా దపాయ శత రాజ్య పయోధి మధ్యాత్
రాష్ట్ర ప్రజాం పశుపతి ర్నవ కర్ణ ధారః
ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర రజతోత్సవమున్ గను భాగ్య మింతకా
లమ్మున కబ్బె హస్త గత లక్ష్మియు బోలె అపూర్వమైన యీ
సొమ్మును యావదాంధ్ర జన సోదరులున్ చవి చూచు మాటయో
తెమ్మని యొక్కరే తమ కధీనము జేసి కొనంగ జూచుటో
అది రాక్షస వృత్తి తదా
స్పద మీ నాడనెడు మాట దప్పించుటయే
మొదటి పని సకల రాష్ట్రా భ్యుదయాలోకన పరాయ ణోత్సాహులకున్
వర్షము లేక కొంత - అతి వర్షముచే మరి కొంత - క్షామ సం
ధర్షిత యైన యాంధ్రి కలి తాడిత ధర్మ గవీ సమానయై
హర్షము కోలుపోయి నయనా భ్ర సముద్గత బాష్ప వారి నీ
కర్షక కార్మికాది సుత కాండము శోషిల కుండ తన్పెడున్
జన వంచనైక భాజన వణి గ్వ్యాపారములకు నిష్కృతి చూప గలుగు నాడు అతి దురాశా రోగ హత రాజకీయ వా
దులకు శాస్త్రి యొనర్ప గలుగునాడు
Page 24