#


Index

చిత్రతరంగిణి

బలరామావతారము

ముసలం బొక్కటి లాంగలం బొకటి పై మోహ ప్రదా స్వాదనా భ్యసనం బొక్కటి నీల చేల మొకటై ప్రచ్ఛాదనం జేసినన్ పస గోల్పోవని లోని సత్వ గుణ విస్ఫార ద్యుతుల్చిమ్ము నీ ప్రసర త్పాండుర దేహ దీప్తి బలభద్రా నాకు భద్రంబిడున్

కృష్ణావతారము

రాగములో నభంగుర విరాగములో సకల ప్రజా వనో ద్యోగములో సముల్లసిత యోగములో ఒకటేమి టన్నిటన్ భోగమొ మోక్షమో తెలియబోని మహోన్నత భూమికా విహా రాగతమైన పూర్ణ పురుషాకృతి త్రుంచెడు దుష్కృతంబులన్

కల్క్యవతారము

మ్లేచ్ఛ జనావ కీర్ణమయి మేదిని భేద విభావరీ తమో విచ్ఛురితంబు గాగ - సడువీధిని దోచు నవారుణ ప్రభా గుచ్ఛము వోలె నీదయిన కోప విఘూర్జిత మూర్తి యీ కలి స్వేచ్ఛ నడంచి యింక కృత కృత్యత మాకు నొసంగు గావుతన్

Page 23

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు