#


Index

చిత్రతరంగిణి

నృసింహావతారము

శాత క్రూర నఖాగ్ర నిర్దళిత వక్ష స్తోరణ ద్వార ని ర్యాతంబైన మహాస్ర ధార కర దీపాలోకమై యొప్పగా భీతంబై పరతెంచు వేల్పు గమి నన్వేషించు నీ సింహ వి ఖ్యాత లోకము నన్ను బ్రోచు నఘ సంహారంబు గావించుచున్

వామనావతారము

కాల విపర్యయో పనత గాఢ భరంబున నొక్కవంక పాతాళము జేరి జారిపడ దావవ లక్ష్మి - మరొక్క వంకను ద్వేల జవంబునన్ పయికి తేలి నభంబున ప్రాకి పోవు నా కాలయ లక్ష్మి బోలు భవ ధంఫ్రీ త్రివిక్రమమై వెలింగెడున్

పరశురామావతారము

ఆగమ పాఠ పూత జమదగ్ని శిరంబె ఋణంబు గొంచు న ట్లేగిన కార్తవీర్యు గుణహీను సబాంధవ సాన్వయంబుగా నీగల తిండి జేసి శత వృద్ధిగ దానిని దీర్ప జేయు నీ యాగడ మస్మదీయ కలుషాగ పరశ్వథమై తనర్చెడున్

రామావతారము

జనకుడు తల్లి సోదరుడు జాయ తలంప నెపంబె గాని నీ మనుజ కులావతార మహిమంబు సముద్ధత యాతుధాన మర్దన ఘన కార్య దీక్షకె గదా తలపోయగ వేయునేల ఓ యినకుల సార్వభౌమ యెలయింపుము మాకు సుఖంబు శాంతియున్

Page 22

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు