కస్మైచిత్. కింత్వాత్మనే ఏవ ఆత్మనా ప్రయుక్తః స్యాత్. ఇయం ఆత్మైకత్వ దృష్టిరేవ ప్రతిపాదితో విషయ ఇతి అనేన మకుటవ్యాజేన సూచ్యతే భగవత్పాదైః. తదవిస్మరణార్థంచ భూయో భూయః ప్రతి శ్లోక మస్మిన్ దక్షిణా మూర్తి స్తోత్రే అను బధ్యతే ఆ నవమాత్. ఇతి శమ్.
దశావతార స్తుతి
మత్స్యావతారము
శ్రుతి విజ్ఞాన సువర్ణపేటి ప్రళయార్లో రాశి మధ్యంబులో పతితంబైన విచేష్టుడై నలువ సంప్రార్థింప తత్సాధనో ద్యత కాలాయస యంత్రమో యనగ వక్త్రంబున్ విదారించు నీ యతి లోకంబగు మత్స్య మూర్తి నెదలో నర్చింతు నశ్రాంతమున్
కూర్మావతారము
సకల చరా చరా కృతుల సంపుటమై చను విశ్వ రూపమున్ ప్రకటము సేయనో యనగ రత్నములున్ జగముల్ తురంగముల్ సకియలు నోషధీతతి విసంబు సుధారసమున్ వెలార్చు నీ యకుటిల కూర్మ రూపమున కంజలి సేయుదు తాప శాంతికై
వరాహావతారము
దానవు డీత డాత్మ బల దర్పితు డాపయి భూత ధాత్రికిన్ హాని దలంచె చూడు డని నట్లు హిరణ్యు నిశాత దంష్ట్రికా ధీన శరీరు జేసి నలు దిక్కుల త్రిప్పుచు నూగు చెక్కగా గానుగ నాడు నీదు కిటి కాయము నా యఘమున్ హరించెడున్
Page 21