#


Index

చిత్రతరంగిణి

అంతవరకే ఏ రచనలోనైనా హాస్యానికి ప్రవేశం. హద్దు దాటి ప్రయోగిస్తే అది కేవలం వీరావేశం.

  ఇంతకూ జీవితానికి సుఖదుఃఖాలు రెండే అనుభవాలైతే వాటికి ప్రతినిధులుగా రచనలో కూడా హాస్యకరుణ రసాలే కనిపిస్తాయి. కనుకనే అటు కామిడీగానో, ఇటు ట్రాజడీగానో నడుస్తూ వచ్చింది ప్రపంచ సాహిత్యమంతా. అందులోనూ సుఖమే చివరకు వాంఛనీయంగా బట్టి మోద విషాదాలను జోడించి వ్రాసినా చివరకు మహర్షుల దగ్గరినుంచీ మన రచయితలు ప్రమోదాంతంగానే ముగిస్తూ వచ్చారు తమ రచనలన్ని. తుదకు సర్వప్రపంచ నాటకమూ సమాప్తమయ్యే ప్రళయంలో కూడా నటరాజు చేసే అట్టహాసంలో నిరంతర కష్ట పరంపరతో సాగే జీవిత సమరంలో చివరకు విజయం సాధించే సాధించాల్సిన భావమొక్క హాస్యమేనని తేలుతుంది.









Page 205

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు