#


Index

చిత్రతరంగిణి

ద్వారాలయినాయి మనపాలిటికి. ఆ మహాశక్తి తిరోధానమిది. ఆవిడ సాగించే సృష్టి స్థితిలయాలీ తిరోధానమే. పోతే తమసోమా జ్యోతిర్గమయ అన్నట్టు సంసారంలో పడదోసిన ఈ ద్వారాలే సాయుజ్యానికి దారి చూపుతాయి. అది ఆవిడ అనుగ్రహం. అప్పుడా నవరాత్రాలు తమోమయమైన ద్వారాలుగాక జ్యోతిర్మయమైన ద్వారాలయి ప్రకాశిస్తాయి. తమస్సు మన అజ్ఞానమైతే జ్యోతి స్సుమన కుదయించే ఆత్మజ్ఞానం. ఆ వెలుగులో ముందుకు సాగిపోతే పృధి వ్యాదులైన బాహ్యోపాధులూ, మనో బుద్ధ్యాదులైన అభ్యంతరో పాధులూ రెండూ గడచి పోగలం, అప్పుడీ నవత్వానికి స్వస్తి చెప్పి దానికతీతమైన సాయుజ్యదశనందు కోగలం. అదే దశమి. జీవిత విజయాన్ని ప్రసాదించే దశమి. విజయదశమి. మహిషిరూపమైన అజ్ఞానాన్ని మర్దించి జ్ఞానజ్యోతి అనుగ్రహిస్తుంది ఆ దుర్గాదేవే మనకు. అప్పుడది మనకు దుర్గమ గాదు, సుగమ మహాభాగవతుడూ, మహాకవి, మహాదార్శనికుడూ అయిన పోతనామాత్యుడిలాగా మనమూ అలాటి పునర్జన్మ నిచ్చన మహాశక్తిని మాయమ్మ అని ధైర్యంగా చెప్పుకోగలం, ధన్యులం కాగలం.







Page 192

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు