#


Index

చిత్రతరంగిణి

లేకపోతే జీవితమే లేదు. ఆ సూర్యరశ్మి ఉత్తరంవైపు ఎక్కవగా మొగ్గు చూపుతుంది సంక్రాంతి నుంచీ. అందుకే పగటివేళ ఎక్కువా రాత్రి కాలం తక్కువా అప్పుడు.

  భౌతికమేగాక ఆధ్యాత్మికమైన రహస్యం కూడా ఎంతో ఉంది ఇందులో. సూర్యుడు మానవుడి బుద్ధికీ జ్ఞానానికో ప్రతీక. మానవుడి బుద్ధి వికసించేది సూర్యుడి వల్లనే. సూర్యోదయంతో మేలుకొంటుంది మన జ్ఞానం. సూర్యాస్తమయంతో అస్తమిస్తుంది. ఉదయం తేజస్సు అస్తమయం తమస్సు. తమసోమా జ్యోతిర్గమయ. మనమెప్పుడూ తమస్సునుంచి సూర్యతేజస్సు వైపు ప్రయాణం చేయాలి. అదే పురోగతి మానవుడికి. కనుకనే శుక్ల కృష్ణ అనే మాటల కర్థం వ్రాస్తూ జ్ఞాన ప్రకాశకత్వాత్ శుక్లా - తద భావాత్కృష్టా అని వ్యాఖ్యానించారు భగవత్పాదులు.

ముగురమ్మల మూలపుటమ్మ

  అమ్మల గన్న యమ్మ - మగురమ్మల మూలపుటమ్మ చాలపెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చిన యమ్మ, దుర్గ, మా యమ్మ అని కీర్తించాడు సహజ పాండిత్య సంపన్నుడు బమ్మెర పోతనా మాత్యుడు. ఎవరీ ముగురమ్మలు, ఎవరా మూల పుటమ్మ. మూల పుటమ్మ ఎవరో కవిగారే చెప్పారు దుర్గాదేవి అని. దుర్గ అంటే పార్వతి అని గదా ప్రసిద్ధి. ఆవిడ మూలపుటమ్మ ఎలా అయింది. అయితే ఆ ముగురమ్మలలో పార్వతి లేదా, ఉంది. సరస్వతీ, లక్ష్మీ, పార్వతి వీరు ముగ్గురూ చేరితేనే ముగురమ్మలవుతారు. అలాంటప్పుడు దుర్గమాయమ్మ అంటాడేమిటి మహాకవి. ఏదో ఉంది ఇందులో మర్మం తడవి చూద్దాం.

  దుర్గ అంటే ఆయన మనసులో ఉన్నది పార్వతీదేవిగాదు. దుఃఖే నాధి గంతుమ్ శక్యత ఇతి దుర్గా అని అక్షరార్థం. ఎంతో కష్టం మీద గాని గ్రహించలేనిదేదో అది దుర్గ. పరమాత్మ మాయా శక్తికే దుర్గ అని పేరు. మనోవాచా మగోచరమది. మాయాంతు ప్రకృతిమ్ విద్యా, న్మాయినం తు మహేశ్వరమ్. ఆయన మాయావి అయితే, ఆయన నాశ్రయించిన మహాశక్తి మాయ. ఒక ఐంద్ర జాలికుడి శక్తికే మనం జవాబు చెప్పలేము లోకంలో. వాడవి మన ముందు ప్రదర్శిస్తుంటే ఊరక

Page 189

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు