#


Index

చిత్రతరంగిణి

విజయం

  జయీ భవ విజయీభవ అని పూర్వం రాజులను కైవారం చేసేవారు వంది మాగధులు. ఎవరితో ఎప్పుడు పోరాట మేర్పడినా విజయాన్నే పొందాలని ఆకాంక్ష. జీవితమంతా మానవుడికి పోరాటమే. ఎప్పుడే పని చేస్తున్నా అది మనుకూలంగా జరగాలనే కోరుతుంటాము. ప్రతికూలంగా జరగాలని ఎవరికీ ఇష్టంలేదు. అనుకూలిస్తే విజయం. ప్రతికూలిస్తే అపజయం. మానవ ప్రకృతి ఎప్పుడూ విజయమే కోరుతుంది. కాని ఈశ్వర ప్రకృతి విషయమలా కాదు. ఇచ్చినప్పుడు విజయమిస్తుంది. లేనప్పుడప జయమిస్తుంది. నీవు కోరిందే లభిస్తుందని చెప్పలేము. పుణ్యానికిపోతే పాప మెదురయిందని సామెత. మనమొక టనుకొంటే మరొకటవుతుంది సృష్టిలో. సృష్టికర్తకు మన మీద దేనికింత పగ. పగ కాదిది. మనకది ఒక చక్కని పాఠం. అఖండమైన నాసృష్టిని నీ దృష్టితో ఖండం చేసి చూస్తున్నా వలా చూడవద్దని చెప్పటం. ఇది నాకనుకూలమిది ప్రతికూలమని ఎవరు చెప్పారు. సృష్టి చెప్పిందా. సృష్టికర్త చెప్పాడా. ఏదీ కాదు. నీ దృష్టితో చూస్తున్నా విది మంచి చెడ్డ అని. అలా చూడటం మూలాన్నే నీ కనుకూలంగా జరిగితే విజయగర్వంతో ఉప్పొంగుతావు. ప్రతికూలమైతే పరాజయం పాలయి కుంగిపోతావు.

  ఈ పాటు పోటులకేమి కారణం. నీ దృష్టిలో ఉన్న సంకుచితత్వం, స్వార్ధం. స్వార్ధం ఫలిస్తే నీకు సంతోషం. లేకుంటే విషాదం. నీ పక్కవాడు కూడా అలాగే భావిస్తాడనుకో. అప్పుడే మవుతుంది. నీ వనుకూలమనుకొన్నది వాడికి ప్రతికూలం కావచ్చు. వాడి కనుకూలమైనది నీకు ప్రతికూలించవచ్చు. నీవు నీ వలయంలో ఉంటే వాడు వాడి వలయంలో ఉన్నాడు. ఎవడి స్వార్థం వాడిది. నీ స్వార్థం వాణ్ణి దెబ్బ తీస్తే వాడి స్వార్థం నిన్ను తీస్తుంది. అప్పుడెవరిది విజయం. ఎవరిదపజయం. నీ వొక విజయం చవిచూచావంటే అది మరొకడి కపజయమే కదా. వాడపజయం పాలవుతున్నంత వరకూ నీవా విజయం సాధించి సుఖమేమిటి. నిజమైన సుఖం సకల జీవులూ సుఖపడ్డప్పుడే. అప్పుడొకడిదే గాదు విజయం. అందిరదీ. అందరిదీ అని చూచినప్పుడిక నీవే విజయం పొందాలనే స్వార్థం లేదు. లేకుండా పోవాలంటే

Page 179

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు