#


Index

చిత్రతరంగిణి

చెందగలం. శారీరకంగానే చెందగలం. మనసును బట్టే ఏదైనా. కాబట్టి మనః క్షేత్రంలో జరగాలి కృషి.

  ఎలా జరగాలది. ఏ మార్గంలో జరగాలని ప్రశ్న. మన గమ్యాన్నిబట్టి ఉంటుంది. మన మార్గం. భౌతికమైన అవసరాలూ కాపచ్చునది. సామాజికమూ కావచ్చు. వైజ్ఞానికమూ కావచ్చు. ధార్మికమూ కావచ్చు. సంగీత సాహిత్యాది కళాత్మకమూ కావచ్చు. దేనిలో చేస్తే దానికి తగిన సంస్కారమిస్తుంది మనసుకు. అది మన ఆంతర జీవితానికీ బాహ్య జీవితానికీ కూడా వెలుగును ప్రసాదిస్తుంది. అయితే అన్నిటికన్నా విశిష్టమైనది ఆధ్యాత్మికంగా సాగించే కృషి. అది ఒక మహాసముద్రంలో స్నానం చేయటం లాంటిది. నదులన్ని సముద్రంలో చేరిపోయినట్టు మిగతా క్షేత్రాలలో సాగించిన కృషి అంతా అందులోనే కలిసివస్తుంది. కారణమేమంటే అది అనేక భేదభావాలతో నిండి ఉన్న ఈ ప్రపంచాన్ని అభేద దృష్టితో చూచి సమన్వయించుకొనే మనో వైశాల్యాన్ని నీకందిస్తుంది. ఏపని చేసినా ఏది చూచినా దేనితో వ్యవహరిస్తున్నా రాగద్వేషాలకతీతమైన సమభావనతో సానుభూతితో నడుచుకొనే సహృదయతను ప్రసాదిస్తుంది. బహుజన హితాయ, బహు జన సుఖాయ వ్యక్తి తాను సుఖపడి తన తోడి వారందరినీ సుఖపెట్టాలి. అందుకోసం చేసిన కృషే నిజమైన కృషి ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అని గీతా సందేశం. నీలాగా నీ ఎదుటివాణ్ణి చూడగలగాలి. అది జన్మతః కలగకపోతే కృషి చేసి అలవరచుకోవాలి. హస్తిపాదంలో అన్ని జంతువుల పాదాలూ ఇమిడి పోయినట్టు మిగతా రంగాలలో చేసిన కృషి అంతా దానిలోనే చేరిపోతుంది. ఉత్తమ కృషి అదే. ఉత్తమ సంస్కారమదే. ఉత్తమ జీవితామూ అదే.







Page 178

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు