ప్రతిక్షణమూ మౌనంగా ఉండు. అంతర జగత్తులో మాత్రం చురుకుగా ఉండు. తా చష్మో జుబానో గోష్బార్ జా బాషంద్, బేచష్మో జుబానొ గొష్ మీ భాయద్ బూద్. నీ కన్నూ, చేవీ, నాలుకూ పని చేస్తుండగానే అవి ఏవీ లేనివాడిలాగా వ్యవహరించు. ఎంత గొప్పమాటో చూడండి ఇది. ఒక జీవన్ముక్తుడికి గాని ఇలాటి వ్యవహార మబ్బదు.
5. అంతేకాదు. ఫర్దా మతలబ్, బెగుజార్ దీ, హాలీ బిబీన్, వఖుంష్ బాష్,
రేపటి విషయం అన్వేషించకు. నిన్నటి విషయం వదిలేయి. వర్తమానమేదో అదే
చూడు. సుఖంగా బ్రతకమంటాడు. ఏమిటీ మాట. ఎంతో అర్ధముంది ఈ మాటలో.
మనమందరమూ ఉన్నదెప్పటికప్పుడు వర్తమానంలోనే ఉన్నా మనస్సిందులో నిలకడగా
ఉండదు. అది అటు భూతంలోనో ఇటు భవిష్యత్తులోనో తొంగి చూస్తుంటుంది.
చూడండి ఎప్పుడైనా సరే. మన మనసు జరిగిపోయిన విషయాలను గురించైనా
ఆలోచిస్తుంది. లేదా ఇక జరగవలసిన వాటికైనా ప్లాను వేస్తుంటుంది. జరిగింది
ఎలాగూ జరిగిపోయింది. మంచో చెడో అది ఇక తిరిగి వచ్చే విషయం కాదు.
వదలి పోయిందది మనలను. అది వదలినా మనం దాన్ని వదలటం లేదు. అందువల్ల
మానసికమైన బాధ తప్ప అంతకన్నా మనకు లభించే ప్రయోజన మేదీ లేదు.
అంచేత వదలిపోయిన దెలాగూ పోయింది. దాన్ని పూర్తిగా వదలుకో మంటున్నాడు.
ఖయ్యాము. అలాగే భవిష్యత్తింకా రాలేదు. చేయలేదు. భూతం వచ్చినది. భవిష్యత్తింకా
పుట్టనిది. ఏది పుడుతుందో ఎలా పుడుతుందో చెప్పలేము. అలాటి దాన్ని గూర్చి
అన్వేషణ దేనికి నీకు. అది కాక దంత పరీక్ష లాంటిది. ఆకాశ రోమంధంలాటిది.
అది కూడా మానుకోమని సలహా ఇస్తాడు. అయితే మరి ఏది చేయాలని సలహా
హాలీ బిబీన్ వ ఖుష్ బాష్ వర్తమానాన్నే చూచుకొంటూ సుఖంగా బ్రతకమని హాల్
అంటే వర్తమానమేకాక మౌనమని నిశ్శబ్దమని కూడా అర్థమే. భూత భవిష్య
ద్విషయాలను గూర్చిన ఆలోచనలే శబ్దం. అవి సముద్రంలో తరంగాలలాగా పైకి
లేస్తూ పడుతూ గొడవ చేస్తుంటాయి మనసులో. అవి ఎప్పుడు సద్దుమణిగాయో
అప్పుడు మన చిత్త సాగరం కూడా కల్లోలరహితమై ప్రశాంతమైన సాగరంలాగా
స్థిమితంగా ఉండిపోతుంది అదే అసలైన మౌనం. ఈ మౌనదశయే అటూ ఇటూ
Page 175