#


Index

చిత్రతరంగిణి

  7. పోతే ఈ సమస్య కేమిటిప్పుడు పరిష్కారం. మరలా ఆ దివ్యశక్తి అనుగ్రహాన్ని సంపాదించాలి మానవుడు. తిరోధానమే గాక అనుగ్రహమనే గుణం కూడా ఉంది గదా ఆమెకు. తిరోధానమవిద్య అయితే, అనుగ్రహం విద్య. విద్య అంటే గుర్తించటం. మరచిపోయిన మన అసలు తత్త్వాన్ని మరలా జ్ఞాపకం చేసుకోవటం. జ్ఞాపకం రావాలంటే అంత సులభంగా రాదది. ఆ దేవత స్థూల రూపం మన దృష్టి కడ్డు తగులుతున్నది. స్థూలం సూక్ష్మం పరమని దేవతకు మూడు రూపాలు. ఒకదాని వెనుకె ఒకటి భేదించుకొని పోతేగాని అసలు తత్త్వాన్ని మన మందుకోలేము. అలా భేదించాలంటే ఆ మహాశక్తి నుపాసన చేయాలి. చేస్తే ప్రసన్న అయి మనకు ఆవిడే దారి చూపుతుంది. పడగొట్టేది ఆవిడే, పైకి లేపేదీ ఆవిడే.

  8. నవరాత్రా పూజావిధనంలో ఇమిడి ఉన్నదంతా ఈ ఉపాసనా రహస్యమే. దేవీ స్థూల రూపం దగ్గరి నుంచీ పరతత్త్వం వరకూ సాధకుడు చేసే ప్రయాణం. మనమున్న దిపుడు స్థూలరూపం కాబట్టి ఇక్కడినుంచే సాగించాలి ప్రయాణం. ఆవిడ స్థూలరూపమేదో గాదు. మన చుట్టూ కనిపించే ఈ ప్రపంచమే. ఇందులో అటూ ఇటూ కదులుతూ పోయే మన శరీరాలు కూడా ఆవిడ స్థూల రూపమే. శరీరాల నమూనాలో మనం తయారు చేసిన ఆవిడ విగ్రహమూ అదే. ఈ మూడింటికీ ప్రతీకగా సృష్టించిన యంత్రంకూడా అదే. యంత్రానికే శ్రీచక్రమని పేరు పెట్టాము మనం. ఒక్క యంత్రమనే గాదు. అమ్మవారి విగ్రహమూ శ్రీచక్రమే. మానవశరీరమూ శ్రీ చక్రమే. తుదకీ బ్రహ్మాండమంతా శ్రీచక్రమే. బిందుత్రికోణ వసుకోణాదులైన నావావరణలు శ్రీచక్రంలో ఉన్నాయంటే అవి జగచ్చక్రంలోనే కనిపిస్తాయి మనకు. భూమి రాపోనలో వాయుః అని భగవానుడే సెలవిచ్చాడు. పృధివ్యాదులైన ఐదు భూతాలూ అవ్యక్తమహదహం కారాలనే మూడు తత్త్వాలూ కలిసి ఎనిమిది. ఇది అపరా ప్రకృతి. కాగా జీవరూపమైనది పర. పరాపరాలు రెండూ కలిస్తే తొమ్మిది. ఇవి ఈ బ్రహ్మండ శరీరంలో ఎలా ఉన్నాయో పిండరూపమైన మనశరీరాలలో కూడా చోటుచేసుకొన్నాయి. పంచభూతాలకూ చిహ్నమైన అన్నమయాది పంచకోశాలూ, మనోబుద్ధి ప్రాణాలు మూడు, పోతే వీటి నభిమానించే జీవలక్షణం, వెరసి మనతో కూడా ఉన్న వీ తొమ్మిదే. బిందుస్థానం నుంచి బాహ్యమైన భూపురత్రయం దాకా విస్తరించిన శ్రీచక్రమీనవావరణ రూపమైన సృష్టి చక్రాన్నే మనకు సూచిస్తున్నది.

Page 162

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు