భారతీయ సంస్కృతి
సంస్కృతి అనే మాట చాలా గొప్పమాట. సమ్యక్కరో తీతి సంస్కృతిః దేనినైనా చక్కదిద్దటానికి సాధనమేదో అది సంస్కృతి. నైసర్గికంగా ఏవో కొన్ని లోపాలుంటాయి మానవుడిలో. పుట్టగానే ఎవడూ పరిపూర్ణుడు కాడు. పరిపూర్ణత లేనిదే జీవితగమ్యం చేరలేడు. అంచేత మానవుడిలో సహజంగా ఏర్పడిన లోపాలను చక్కదిద్ది వానినొక ఆదర్శ మానవుడుగా తయారు చేసేదే సంస్కృతి. ఆ మాటకు వస్తే ఒక్క మానవుడికే గాదు. లోకంలో ప్రతి ఒక్కదానికీ సంస్కార మావశ్యకమే. కాని మానవుడొకడు బాగుపడితే చాలు. తతిమావన్నీ బాగుపడ్డట్టే. కారణం. అచేతనాలకు లేని ప్రాణశక్తీ చేతనాలైన పశుపక్ష్యాదులకు లేని జ్ఞానశక్తీ రెండూ వాడిలో చోటుచేసుకొన్నాయి. జ్ఞానంతో మంచి చెడ్డలు విమర్శించగలడు. ప్రాణంతో మంచి మార్గమనుసరించగలడు. కాబట్టి సంస్కారమనేది మొదట మానవుడే అలవరచుకోవాలి జీవితంలో.
మానవులందరూ ఒకచోట కాపురం చేయటం లేదు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క జాతి జనులు నివసిస్తున్నారు. ఒక్కొక్క భాష మాటాడుతున్నారు. ఒక్కొక్క ఆచార వ్యవహారాలు పాటిస్తున్నారు. తమ విజ్ఞానమంతా ప్రతిబింబించే ఒక్కొక్క వాఙ్మయాన్ని కూడా సృష్టించుకొన్నారు. అది ఎంత అభ్యుదయ కారకమైతే వారి సంస్కృతి అంత గొప్పది. సభ్యదేశాల సంస్కృతులన్నింటిలోనూ చాలా ప్రాచీనమైనది మన భారతీయ సంస్కృతి. వేదకాలం నుంచీ అనూచానంగా వస్తున్నదిది. చారిత్రకుల అంచనానుబట్టి చూచినా ఋగ్వేదం కన్న ప్రాచీనమైన సాహిత్యము ఏ దేశంలోనూ కానరాదు. ఏనాడు పవిత్రమైన గంగాసింధు తీరాలలో వారి విజ్ఞాన జ్యోతి ప్రకాశించిందో ఆనాడే దాని దీప్తి కిరణాలు యావత్ప్రపంచానికి ప్రసరించి వారి జీవిత విధానాలన్నింటినీ దిద్ది తీర్చింది. ఏత ద్దేశ ప్రసూతస్య- సకాశా దగ్ర జన్మనః స్వంస్వం శిక్షేత చారిత్రం పృథివ్యాం సర్వ మానవాః అన్నాడు మనువు. ఈ దేశంలో పుట్టిన మేధావంతుల వల్లనే మిగతా దేశాలవారంతా అన్ని జీవితరంగాలలోనూ తగిన శిక్షణ సలవరుచుకోవాలట.
ఎంత ఆత్మ విశ్వాసం మన వారికి. నిజంగా మన జాతి సంస్కృతి అలాంటిదే. సందేహం లేదు. ఆర్యజాతి మనది. ఆర్య అంటే పూజనీయమని అర్థం. ఇహపరాలకు రెంటికీ జవాబు చెబుతుంది మన సంస్కృతి. ఐహికంగా వినోద విజ్ఞానా లందివ్వటం
Page 155