#


Index

చిత్రతరంగిణి

ఋత్విక్కులుగా ఈ యజ్ఞాన్ని కాహ్వానించి దీనినొక దీర్ఘ సత్రంగా కొనసాగించాడు. ఇంకా సాగించదలచాడు. ఇంత వరకూ సాగించిన ఆ యజ్ఞప్రసాదమే ఇది. ఇది ఏ సంవత్సరానికా సంవత్సరం సదస్యులందరికీ పంచి పెడుతూనే ఉన్నాడు. ఏమిటా పంచిపెట్టే ప్రసాదమని అడుగుతారేమో అది పులిహోరగాదు, దధ్యోదనంగాదు, చక్కెర పొంగలీగాదు, యజ్ఞం భౌతికం కానపుడు ప్రసాదం మాత్రం భౌతికమెలా అవుతుంది, మరేమిటీ ప్రసాదం. వాటికన్నా మధురమైన, మరపురాని, ఎప్పటికీ తృప్తినిచ్చే ప్రసాదం జ్ఞాన ప్రసాదం. జ్ఞానప్రసాదేన విశుద్ధసత్వాః అని చాటుతున్న దుపనిషద్వాణి, ప్రసాదమంటే నైర్మల్యమనీ అర్థం. పెద్దలైన వారిక్కడికి నిత్యమూవచ్చి చేసే బోధనలొక యజ్ఞమైతే- తన్మూలంగా శ్రోతలందరికీ కలిగే మనో మాలిన్యక్షాళనమే యజ్ఞప్రసాదం. సభాసదులందరూ ఈ ప్రసాదాన్ని అందుకొని తద్వారా అనాత్మరూపమైన మాలిన్యాన్ని క్షాళితం చేసుకొని సర్వాత్మ రూపమైన పారిశుద్ధ్యాన్ని పొందగలిగితే అంతకన్నా కోరదగింది లేదు జీవితానికి.

ఓమ్
ఓమ్
శాంతిః శాంతిః శాంతిః









Page 131

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు