#


Index

చిత్రతరంగిణి

సతమతమయ్యే అవిద్యావంతుడికెలా సాధ్యం. వాడికి అందుబాటులో ఉండే ఆనందమేదో - దానితో పోల్చి చెప్పాలి. దానికే విషయానందమని పేరు. గృహారామ క్షేత్రపుత్ర కళాత్రాదుల వల్ల మానపుడిప్పుడీ విషయానంద మెంతగానో అనుభవిస్తున్నాడు. అయితే ఎంత అనుభవించినా అది కొంతేగాని అంతాగాదు. అంతా అయిన ఆనందమది బ్రహ్మానందమే. మరి ఇదో, ఇది అంతటా పరచినట్టున్న ఆ బ్రహ్మానంద సాగరంలో తరంగాలు- బుద్బుదాలు - తుషారాలూ; కాని ఖండ ఖండాలుగా కనిపించే ఇవన్నీ ఆ అఖండానంద ఖండాలేనని ఎప్పటికప్పుడను సంధించుకో గలిగితేచాలు. వీటి ననుభవిస్తున్నప్పుడు కూడా దాని దృష్టి సడలకుండా నిలుస్తుంది, అంటే ఇదే దానికి సాధన మవుతున్న దొక విధంగా. దీనితో ఆనంద పంచకం కూడా పరిసమాప్తి మయింది.

  14. ఇంతకూ సత్తా చైతన్యసుఖాలనేవి మూడే బ్రహ్మ లక్షణాలు. ఇవే ఈ అనంత విశ్వమంతా పనగలిసి ఉన్నాయి. మృత్పాషాణాదులలో సత్తాయేగాని మిగతా రెండూ వ్యక్తంకావు. మనో వృత్తులలో - రాజస తామసాలలో సత్తాచైతన్యాలు రెండే గాని మూడవదైన సుఖం వ్యక్తంకాదు. పోతే సాత్త్వికమూ శాంతమూ అయిన మనోవృత్తిలో సత్తా చైతన్య సుఖాలు మూడు సమపాళ్లలో ప్రతిఫలించి మనసు బ్రహ్మాకారంగా పరిణమించగలదు. ఇలాటి శుద్ధ సత్త్వాన్ని అలవరుచుకొని తద్వారా ఆత్మజ్ఞానమూ - తన్మూలంగా బ్రహ్మనుభవమూ గడించి జీవిత పరమార్థమైన మోక్ష పురుషార్థమందు కోవటమే ఆనంద పంచకంలోని ఆంతర్యం. పోతే వివేక దీప పంచకాలనేవి రెండూ రెండు సాధనాలుగా చేసుకొని బ్రహ్మానందమనే ఆ మహాఫలాన్ని అందుకొని తరించమనే విద్యారణ్యుల వేదాంతపంచదశీ సందేశసారం.

Page 129

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు