#


Index

చిత్రతరంగిణి

గాని ఇచ్చుకోటానికే అలవాటు పడరు. మాఘ కవి ఈ సూత్రానికొక పెద్ద అపవాదం. బలి శిబి కర్ణదధీచులను తలపించే-ప్రాణత్యాగానికి కూడా సిద్ధమయ్యే-వదాన్యతా గుణమతనిది. ప్రజత ప్రజత ప్రాణా-అర్థిని వ్యర్థతాంగతే- పశ్చాదపిహి గంతవ్యమ్-కోవార్ధః పునరీదృశః-ప్రాణమా వెంటనే వెళ్ళిపో - అర్థి జనం వ్యర్థంగా వెళ్ళిపోయిన తరువాత నీ వుండి ఏమి ప్రయోజనం. తరువాతనైనా నీవు నన్ను విడిచి వెళ్ళే దానివే. ఇప్పుడేవెళ్లు. యశస్సైనా దక్కుతుందని అవసానంలో కూడా వాపోయాడని ఆభాణకం.

  8. మొత్తంమీద వైశ్యకులంలో పుట్టి శ్రేష్ఠి అయి కవికుల శ్రేష్ఠుడై గుణగణ జ్యేష్ఠుడైన మాఘ కవి జీవితం నిజంగా అమోఘం. కులంకన్నా గుణం- గుణం కన్నా రచన - రచనకన్నా జీవితం -జీవితంకన్నా జీవితధ్యేయం- ఎంత విశిష్టమైతే అంత ఉత్కృష్ణుడా కవి. అలాంటి కవి మహాకవి మాఘుడు. అలాంటి మహాత్ముడు రచించిన కావ్యం నిజంగా దివ్యమూ అనంతకాల భావ్యమూ సహృదయ సేవ్యమూనని చెప్పడానికెప్పుడూ సందేహంలేదు.









Page 115

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు