#


Index

చిత్రతరంగిణి

ఆవిర్భవించిన తేజో రూపిణి ఆవిడ. ఐశ్వరమైన జ్ఞానంతో అవినాభూతంగా ఉన్న ఆ మహాశక్తి ఆజ్ఞానం నుంచే ప్రాదుర్భవిస్తుంది. అందులోనే మరలా ప్రవేశిస్తుంది. రెండింటికీ ప్రయోజన మొక్కటే. అది "దేవకార్య సముద్యతా” అన్నట్టు లోక కళ్యాణాన్ని సాధించటమే.

  ఒకప్పుడు దక్ష ప్రజాపతికి కూతురయి జనించింది అమ్మవారు. అప్పుడామె పేరు సతీదేవి. సద్రూపిణి అయిన శక్తి అనే అర్ధం. చిద్రూపుడైన పరమేశ్వరుణ్ణి ఎడబాయకుండా ఉన్న ఆదేవి దక్షుడు చేసిన శివదూషణ సహించలేక యోగాగ్నిలో స్వయంగా దగ్ధమయింది. మరలా హిమవంతునికి పార్వతి అనే పేరుతో ఉదయించి తపోగ్ని జ్వాలలో మరలా పరిశుద్ధ అయి ఆ పరమేశ్వరునే చెట్ట బట్టి ఆయనతో ఐక్యాన్ననుభవించింది. పోతే మరి ఒకప్పుడీదేవి వేదవతి అనే పేరుతో హిమవచ్చిఖరం మీద తపస్సు చేస్తూ రావణుడు తన్ను బలాత్కరించబోగా యోగాగ్ని ప్రజ్వలింపజేసి అందులో అంతర్ధానమయి మరు జన్మలో సీత అనేపేరుతో అయోనిజ అయి అవతరించి శ్రీరాముని అర్ధాంగి అయి ఆయనచేత రావణ సంహారం కావించి మరలా లోకప్రత్యయార్థం అగ్నిహోత్రంలో ప్రవేశించి తన దివ్యత్వాన్ని లోకానికి చాటింది.

  ఈ విధంగా అగ్నిలోనుంచి ఆవిర్భవించటమూ అగ్నిలో ప్రవేశించటమనేది అమ్మవారికి క్రొత్తగాదు. అందులో ఎంతైనా అంతరార్థముంది. అగ్ని అంటే అది భౌతికం కాదు. చైతన్యమే అగ్ని. దానితో ఓతప్రోతంగా ఉన్న చిచ్ఛక్తి స్వరూపిణే దేవి. శివశక్తులకుండే ఈ అఖండాత్మభావాన్ని శిష్టప్రపంచానికి చాటి చెప్పటానికే ఆవిడ ఆవిర్భావం. అది అర్ధంచేసుకోలేక అహంకరించే దుష్టలోకాన్ని శిక్షించి వాళ్ళకు కళ్ళు తెఱిపించటానికే మరలా అందులోనే ఆవిడ తిరోభావం. ముందు పేర్కొన్న రెండు సందర్భాలలోనూ మనకు తార్కణమయ్యే విషయమిదే.

  సరిగా ఇదే మనకు మరలా ఈ వాసవ కన్యాకావతరణంలో కూడా సాక్షాత్కరిస్తున్నది. ఆమె దివ్య ప్రభావానికి తగినట్టే మొదట ఆ దేవి మహాగిరినివాసి యగు వైశ్యఋషి సమాధి అను వానికి కీర్తికన్య అను పేరుతో కుమార్తె అయి జనించింది. చిత్రకంఠుడనే గంధర్వరాజు తన్ను కామించి విఫలుడయి నూట ఒక్క మంది గోత్రములవారిని భూలోకమున బుట్టి ఈ కన్యతోకూడ అగ్నిహోత్రమున

Page 107

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు