అతడే వైశ్యుడు. దేవతలలో వసువు. ఆ వసుగణానికి చెందినవారు గనుకనే వైశ్యులను వాసవులని పేర్కొనవచ్చు.
ఇలాటి వాసవజాతిలో జన్మించిన కన్య గనుకనే వాసవకన్య అయింది అమ్మవారు. కంసుడు పైకి ఎగుర వేసినప్పుడాకాశవీధిలో సాక్షాత్కరించిన యోగమాయకు వదునాలుగు పేర్లుదాహరించింది భాగవతం. విజయా-దుర్గా-మాధవీ-నారాయణి అని వర్ణించిన ఆ పదునాలుగింటిలో కన్యక అనే మాటకూడా ఒకటి. కన్య-అన్నా, కుమారి - అన్నా, బాల- అన్నా ఆ మహాశక్తి నామావళే. విశ్వవ్యాపిని అయిన ఆ మూలశక్తి జరాయుజాది వ్యష్టి శరీరాలలో ప్రవేశించి మూలాధారం దగ్గిరినుంచి సహ స్రారంవరకూ ఆయా చక్రాల నధిష్ఠించి ఉంది. ఒక్కొక్కస్థానంలో ఆవిడకొక్కొక్క పేరు. అందులో మూలాధారాన్ని ఆశ్రయించినప్పుడావిడ బాలశక్తి, బాలఅన్నా, కన్య అన్నా ఒక్కటేనని చెప్పాము, ఆరోహణ క్రమంలో మొదటి మెట్టుననే ఉంది కాబట్టి ఆ పేరు వచ్చిందని చెబుతారు శాస్త్రజ్ఞులు. కాని అసలమూర్తమైన శక్తికి బాల్యమేమిటి యౌవనమేమిటి వార్ధక్యమేమిటి, ఉపాధులనుబట్టి చెప్పినపేర్లే గాని అసలు మూర్తమైన శక్తికి వయోభేదమే లేదు. అందుకే "త్వమ్ కుమార ఉతవా కుమారీ-త్వమ్ జీర్ణోదండేన వంచసి" అని లింగవయో భేదం లేకుండా వర్ణించింది శ్వేతాశ్వతరోపనిషత్తు, లలితా సహస్రనామాలలో బాల-వృద్ధ- ప్రగల్భ-అని అన్ని వయస్సులకు చెందిన నామాలూ ఉన్నాయి దేవికి. ఆ మాటకువస్తే ఈ పేర్లు వయస్సును సూచించేవని కూడా చెప్పనక్కరలేదు. బాల అంటే బలశాలిని-కన్య అంటే తేజోరూపిణి అని శబ్దార్థం చెప్పినా సరిపోయే వ్యవహారమే.
ఇంతకూ వాసవ అనేది అటు దేవలోకానికీ- ఇటు మానవలోకానికీ సంబంధించిన మాట అయితే- కన్య అనేమాట ఆ దివ్యశక్తే ఈ మానవ జగత్తులో ఒక మానవకన్యగా-వైశ్యకన్యగా అవతరించిందనే భావాన్ని మనకు సూచిస్తున్నది. అవతరించటమంటే అది దేవతలకే. మానవులకు గాదు. మానవులది జన్మ అయితే దేవతలది అవతారం. అందులోనూ సకల దేవతాజనని అయిన శక్తి అవతరణ మరీ విలక్షణమైనది. “చిదగ్నికుండసంభూతా” అన్నట్టు కేవలమూ జ్ఞానాగ్ని కుండం నుంచి
Page 106