#


Index

శ్రీ విష్ణు సహస్రనామ అంతరార్థము
నామం అంతరార్థము
సవితా రవిలోచనః (సవితార + విలోచన) విశేషంగా తరింపజేసేది సవితారం. అలాటి దీప్తితో కూడిన విలోచన చూపది.
అనంతః
హుతభుక్
భోక్తా
అంతంలేనిదా చూపు. భోక్తననే భావం హుతం చేసి భుజించాలి దాన్ని సాధకుడు. అప్పుడేవాడు భోక్త కాని భోక్త పూర్ణభోక్త అవుతాడు.
సుఖదః
నైకజః
అగ్రజః
అలాంటివాడిదే పూర్ణమైన సుఖం. ఆ సుఖాన్ని అదే ప్రసాదిస్తుంది. అనేక రూపాలుగా జన్మిస్తున్నదీ - అన్నింటికీ ముందు జన్మించినదీ తానేనని భావిస్తాడు.
అనిర్విణ్ణః
సదామర్షీ
లోకాధిష్ఠానమ్
జన్మిస్తున్నా, జన్మించకున్నా ఎప్పుడూ విసుగు చెందడు. అన్ని భావాలనూ ఎప్పుడూ సహిస్తూనే (మర్షీ) ఉండగలడు. ఆరోపిత జగత్తు అనులోమ ప్రతిలోమాత్మకమైనా దాని కధిష్ఠానం గనుక రెండూ సమానమే దానికి.
అద్భుతః అభూతమే అద్భుతం. భూతం కానిది కనుకనే దానికది సంభవమైంది. అందుకే మన దృష్టికది అద్భుతం.
సనాత్సనాతనతమః అద్భుతం - ఎప్పుడూ భూతం అంటే ఏర్పడినది కాదు గనుకనే సనాతనం కన్నా సనాతనమైన తత్త్వమది.
కపిలః
కపిః
అప్యయః
స్వస్తిదః
స్వస్తి
కంపన శీలమైనదేదో అది కపిల. అంత అభూతమయి కూడా చలిస్తున్నదది. అదే అద్భుతం. అది చలించటం వల్లనే చలిస్తున్న ఈ జీవుడేర్పడ్డాడు (కపి) ఏర్పడి మరలా దానిలోనే (అప్యయ) లయమయి పోతున్నాడు. జీవుడప్యయం చెందితే అది వాడికి స్వస్తిదం. సు+అస్తి-కేవలా స్తిత్వాన్ని పొందుతాడు. అది కలిగిస్తాడాయన వాడికి. అదే స్వస్తి శ్రేయస్సు మానవుడికి, దానినే భుక్ - అనుభవించాలెప్పటికైనా.

Page 61

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు