సాధన మార్గాన్నో - సిద్ధినో నాలుగింటిలో ఏదో ఒక దాన్ని సూచిస్తూనే ఉంటుంది. నాలుగని పేరేగాని నాలుగూ కలిసి ఒక్కటే. ఆ ఒక్కటే సహస్రముఖాలతో ఘోషిస్తున్నదీ సహస్రనామం. మనం వికర్ణులమూ, కుంభకర్ణులమూ కాక సుకర్ణులమై ఆలకిస్తేనే ఆ భగవద్వాణి మనకు వినిపిస్తుంది. విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆ ప్రసాదాన్ని నేనందుకొని తమకందరికీ పంచిపెట్టటమే మహావిష్ణు సేవగా భావిస్తూ సెలవు తీసుకొంటున్నాను.
ఇట్లు
భవద్విధేయః శ్రీరాయః
Page 6