#


Index

శ్రీ విష్ణు సహస్రనామ అంతరార్థము

ప్రకృతి పురుషతత్త్వాలనే వ్యాసహృదయం. పద్మనాభ సహోదరి అనే దేవీనామంలో ఇదే గుప్తంగా సూచించాడు. ఒకే పరమార్థమనే ఉదరాన్ని చించుకొని బయటపడ్డాయి రెండు భాగాలు. ఒకటి జ్ఞానశక్తి మరొకటి క్రియాశక్తి. రెండూ ఒక దానికొకటి అవినాభూతం.

  ఇదుగో ఇలాంటి అద్వైత బ్రహ్మాత్మభావాన్ని వ్యాసభగవానుడీ రెండు స్తోత్రాల ద్వారా సాధకలోకానికెలా అందించాడో వ్యాఖ్యానించి చూపాలని నా సంకల్పం. దాని కనుగుణంగా ఇంతకుముందు లలితాష్టోత్తర శతాన్ని వివరిస్తూ ఒక గ్రంథం రచించాను. అది ఇంకా వెలుగు చూచే లోపుగా కొందరు జిజ్ఞాసువుల కోరిక మేరకీ విష్ణు సహస్ర వ్యాఖ్య ముందుగా ముద్రించవలసి వస్తున్నది. వివక్షితమైన తత్త్వమొక్కటే అయినప్పుడేది ముందైనా నష్టం లేదు. ఎటు వచ్చీ తత్త్వాన్నీ గుర్తించకుంటేనే నష్టం. అది ప్రతి నామంలోనూ లోతుకు దిగి చూడవలసి ఉంది మనం. నామాలకు కూడా ప్రసిద్ధమైన వాచ్యార్థం చెబితే సరిపోదు. ఇవన్నీ గుణనామాలు సుమా-ధాత్వర్థంతో ముడిపెట్టి అర్థం చెప్పుకోమని హెచ్చరించాడు మహర్షి. అంచేత తదాదేశానుసారం నామాలను నిర్వచిస్తూ వాటి అంతరార్థం, పరమార్థం వరకూ ప్రయాణం చేయాలి మనం. లేకపోతే విష్ణు నారాయణ, గోవింద, అధోక్షజ, శివ, కేశవ అన్నిటికీ ఒకే అర్థం రొకటి పాటగా చెప్పుకొంటూ పోవలసి వస్తుంది. పైగా న్యగ్రోధోదుంబరః అశ్వత్థః - అభిప్రాయః - ఇలాంటి వాటికేమని చెబుతావర్థం. కాబట్టి ఎంతో భావన చేయవలసి ఉంది నామాన్ని వివరించేటప్పుడు. ప్రతి నామమూ సాధకుణ్ణి పరమాత్మనో,

Page 5

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు