నామం | అంతరార్థము |
---|---|
భూతమహేశ్వరః | రజస్తమస్సులను సింహంలాగా హింసిస్తుంది. అప్పుడే సమస్త భూతాలకూ మహేశ్వరుడనిపించుకొంటాడు మానవుడు. |
ఆదిదేవః మహాదేవః దేవేశః దేవభృద్గురుః |
దేవతలూ కొంత కొంత అధీశులే భూతజాతానికి, వారికి కూడా ఆది దేవుడు పరమాత్మ. మహాదేవ. అంతకన్నా పరిపూర్ణమైన దాయన దీప్తి. దేవతల దీప్తి శకలాలకన్నింటికీ అధీశ్వరమైన దీప్తి. దీప్తి కలిగిన వాటన్నింటికీ దీప్తి నొసగిన గురువది. |
ఉత్తరః గోపతిః గోప్తా |
నీవెంత గురువని చెప్పినా అంతకన్నా (ఉత్తర) గొప్ప గురువా పరమాత్మ, గో అంటే జ్ఞానం. సమస్త జ్ఞానాలకూ పతి అతీతమైన జ్ఞానమది. ప్రజ్ఞానం బ్రహ్మ. దానినెప్పుడూ గోప్యంగా ఉంచుతాడు. బయటపెట్టడు. |
జ్ఞానగమ్యః పురాతనః |
జ్ఞానమంటే ఇక్కడ బ్రహ్మజ్ఞానం. ఒక్క బ్రహ్మాకార వృత్తిచేతనే దాని నందుకోవలసి ఉంది. క్రొత్తగా ఏర్పడేది కాదు మరలా. అందుకోక పూర్వమే ఉందది. కేవల మావరణ భంగమే అందుకోవటం. |
శరీరభూతభృత్ భోక్తా కపీంద్రః భూరిదక్షిణః |
పురాతనమైన ఆ చైతన్యమే ఒక వ్యష్టి శరీరాన్ని - సమష్టి శరీరాన్ని రెంటినీ ధరించింది. రెండూ పంచభూతాత్మకమే. రెండింటి లోనూ చేరి శబ్దాది విషయాలను భుజించే భోక్త కూడా తానే. కమ్ పిబ తీతి కపి, సూర్యుడు. అంటే బుద్ధి. దీనికింద్రుడు సాక్షిగా ఉన్నది తానే. ఆ సాక్షిని నీ బుద్ధి పట్టుకోవాలంటే భూరి ఈ ఉపాధి వర్గాన్నంతా (దక్షిణ) త్యాగం చేయాలి. త్యాగేనైకే అమృతత్వమానశుః |
Page 40