నామం | అంతరార్థము |
---|---|
నిమిషః అనిమిషః స్రగ్వీ స్రగ్వి |
నిమిషమంటే సవ్యాపారం. అనిమిషమంటే అవ్యాపారం. ఒకటి జంగమం, మరొకటి స్థావరం. ఒకటి చేతనం. మరొకటి జడం, రెండూ ఆ పరమాత్మే. ఈ చరాచర పదార్థాలే స్రజములు-దండలు. వీటిలో సూత్రంలాగా చేరి చెదరి పోకుండా ధరించి ఉన్నాడు కాబట్టి ఆయన |
వాచస్పతిః ఉదారధీః |
వాక్కంటే ఇక్కడ పరావాక్కు, పరాశక్తి. దానికి పతి ఆశ్రయ మైనదా పరమాత్మ. ధీ అంటే జ్ఞానం. అది పరిపూర్ణంగా ఉన్నవాడు ఉదారధీః ఇంతకూ జ్ఞానమూ శక్తీ రెండూ పూర్ణమే పరమాత్మకు. సర్వజ్ఞుడూ సర్వశక్తుడూ. |
అగ్రణీః గ్రామణీః శ్రీమాన్ |
సర్వజ్ఞుడూ సర్వసమర్థుడూ గనుకనే అగ్రణీః సర్వానికీ ముందుండి నడపగలడు. సాధకుల గ్రామం అంటే బృందాన్ని గమ్యంవైపు నడుపుతూ పోతాడు. దానికి తగిన స్తోమత శ్రీ ఉన్నవాడాయన. అది మనకా శ్రయణీయమైతే ఆయన దానికా శ్రయణీయం. |
న్యాయః నేతా సమీరణః |
అసలా నడిపే ఋజువైన మార్గమూ తానే. నడిపే నేతా తానే, సమీరణ, చక్కగా నడిపే విధానమూ తానే ఆ పరమాత్మ. తనకు భిన్నంగా ఏదీలేదు. |
సహస్రమూర్ధా విశ్వాత్మా |
వేయి తలలతో మోస్తున్నాడీ విశ్వాన్ని. విశ్వమంతా అయి తానే ఉన్నాడు. విశ్వాన్నంతా వేయికండ్లతో కనిపెట్టి చూస్తున్నాడు. |
Page 24