#


Index

   అంటే తాను మేలుకొని మనల నందరినీ మేలుకొలిపి మన జీవితాలను నడుపుతున్నది సూర్యుడే. అది కేవలం భౌతికమైన మండలం గదా. మనకు మిత్రుడేమిటి మన జీవితాలను నడపట మేమిటంటా రేమో. మండలం భౌతికమైతే మండలాంతర్గమైన శక్తి ఒకటుంది. అది దేవత అని చెప్పాము. అవి కూడా చిచ్చక్తి కుపాధులేనని కూడా పేర్కొన్నాము. అది మరచిపోరాదు మనమెప్పుడూ. అంచేత సర్వ స్వతంత్రమైన ఆ చైతన్య దీప్తే ఆదిత్య దీప్తిగా అభివ్యక్తమై మనకొక మిత్రుడిలాగా తోడ్పడుతున్నదని అంతరార్థం. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నట్టు ఆయన ప్రజ్ఞాన స్వరూపుడు. కనుక ఆ జ్ఞానంతోనే నడుపుతున్నాడు మనలను.

   మిత్రో దా ధార పృధివీ ముతద్యామ్. ఆ మిత్రుడే దా ధార ధరించి ఉన్నాడు. దేనిని. పృధివీ ముత ద్యామ్ ఈ భూమిని ఆ ఆకాశాన్ని రెండింటినీ. ద్యావాపృధివీ. భూమ్యాకాశాలను రెంటినీ విభజించి చూపుతున్నాడు. అక్కడ ఉండే గోళాలన్నీ ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. ఇక్కడ భూమి కూడా ఆయన చుట్టే తిరుగుతున్నది. వీటిని తిప్పుతున్నది ఆ సూర్యుడే. ఆయన ఆకర్షణ లేకుంటే ఇవి ఇరుసు మీద ఆకులలాగా ఒక పరిధిలోనే తిరిగే అవకాశం లేదు. అంచేత వీటిని ధరిస్తున్నదా సూర్యుడే. మిత్రః కృష్టీ రనిమిషా అభిచష్టే. అనిమిషా ఎల్లప్పుడూ అభిచష్టే గమనిస్తూ ఉన్నాడు. ఏమిటి కృష్టిః - మనం చేసే సకల కర్మలూ.

Page 90