#


Index

   శరీర మాధ్యంఖలు ధర్మ సాధనమని గదా మాట. యో వశ్శివతమో రసః - తస్యభాజయత ఇహనః – కాబట్టి మీలో ఏశాశ్వతమైన మంగళప్రదమైన సారభూతమైన తత్త్వమున్నదో - అంటే జలంలో అంతర్లీనమై ఉన్న ఏ మహాశక్తి ఉన్నదో దానికి మమ్ము పాత్రులను చేయండి దయ ఉంచి, దాన్ని దర్శించే యోగ్యత మాకందివ్వండి.

   ఎలా సాధ్యమది. మీకు మామీద ఎంతో వాత్సల్యముంటే గాని ఆ పని చేయలేరు. ఒకరికి మేలు చేయాలంటే వాడి మీద వల్ల మాలిన అభిమాన ముండాలి. అది కన్న తల్లి కంటే ఎక్కువగా ఎవరికీ ఉండదు లోకంలో. ఉశ తీరివ మాతరః - అభిమానించే తల్లులని అర్థం. జలమే తల్లి మానవులకు. ద్రవరూపమైన రేతః కణం నుంచే గదా జన్మించాము మనమంతా. మనలో ఉన్నది కూడా 90 వంతులు జలమే. కనుక ఆ జలదేవతలే మన తల్లులు. మాతృస్థానమదే నిజానికి. కనుక తల్లి తనయుడి బాగోగుల నెలా చూస్తుందో అలాగే చూడండి మా బాగోగులు మీరు. తస్మా అరం గ మామ వః అలా చూచారంటే మేము వెంటనే మా మూలస్థానానికి మరలా వెళ్లటం సాధ్యమవుతుంది. ఎంత కాలమయిందో దానికి దూరమయి వచ్చి ఇందులో పడ్డాము. యస్య క్షయాయ జిన్వధ. దాని కోసమే గదా మీరు తిరిగీ మమ్ము చేర్చాలని కోరుతున్నారు.

Page 46