ఉప శ్రుతి
మన వేద వాఙ్మయం రెండు భాగాలు. ఒకటి ప్రవృత్తి. మరొకటి నివృత్తి. ప్రవృత్తి క్రిందికి వస్తుంది కర్మ కాండ అంతా. పోతే ఒక్క జ్ఞానమే నివృత్తి క్రిందికి వస్తుంది. అందులో కర్మ అనేది ఒకటి గాదు. శాస్త్రోక్తమైన కర్మలు నాలుగు విధాలు. అవే నిత్యనైమిత్తిక కామ్య నిషిద్ధాలు. నిషిద్ధ కర్మలు ఇటు కర్మిష్ఠులకూ పనికి రావు. అటు జ్ఞానులకూ పనికి రావు. అవి ఎప్పుడూ వర్జనీయమే. వర్ణనీయమని చెప్పటానికే వేదమవి గూడా పరిగణించింది. పోతే మిగిలిన విక నిత్య నైమిత్తిక కామ్య కర్మలు. అందులో కూడా జ్ఞానులకూ జిజ్ఞాసువులకూ అవి కూడా నిషిద్ధ కర్మల లాగా వర్జనీయమే. కర్మిష్ఠులు మాత్రం చేస్తే చేయవచ్చు. మానితే మానవచ్చు. వారి వారి కామాన్ని బట్టి ఉంటుందది. కాని నిత్యనైమిత్తికాలు మాత్రమలా మానటానికి లేదు. చేసి తీరవలసిందే. ఆత్మ జ్ఞానమే పరాయణంగా పెట్టుకొన్న జిజ్ఞాసువులకూ జ్ఞానులకూ మాత్రమలాటి నిర్బంధం లేదు. కర్మిష్ఠులకు కామ్యకర్మ లెలా వైకల్పికమో Optional అలాగే జ్ఞానులకూ జిజ్ఞాసులకూ నిత్య నైమిత్తికాలు కూడా వైకల్పికమే. చేసినా చేయకున్నా నష్టం లేదు.
Page 4