శబ్దాతీతమైన బ్రహ్మతత్త్వం శబ్ద రూపంగా దిగి వచ్చి మరలా శబ్దాతీతమైన తన స్వరూపాను భవాన్ని శబ్దం ద్వారా మనకు ప్రసాదిస్తున్నదని దీని తాత్పర్యం. ఇంత దూరం దీన్ని భావన చేస్తూ ధ్యానం చేయాలి గాయత్రీ మంత్రాధి దేవతను సాధకుడైన వాడు.
ధ్యానం చేయమన్నారు మంచిదే. అసలు ఏ ధ్యానమైనా ఇలాగే చేయాలని ఒక వేదమంత్రం కూడా చెబుతున్నది మనకు. దానికీ దీనికీ చాలా గొప్ప పోలిక కూడా ఉన్నది. అసలదే ఇదీ ఇదే అదీ అని చెప్పినా చెప్పవచ్చు. అదేమిటంటే
అగ్నిర్మే వాచి శ్రితః
వాగ్ హృదయే
హృదయం మయి
అహ మమృతే
అమృతం బ్రహ్మణి
అగ్ని అనేది పంచభూతాలకూ భౌతికమైన పదార్ధాలకూ సంకేతం అలాగే వాక్కనేది ఇంద్రియాలన్నిటికీ ఉపలక్షణం Representative పాంచ భౌతికమైన విషయ ప్రపంచమంతా మన ఇంద్రియ వ్యాపారాలలో చేరిపోయినట్టు భావన చేయాలి. ఈ ఇంద్రియ వ్యాపారాలన్నీ హృదయే మనో వ్యాపారంగా మారాలి.
Page 34