ఎందుకని జ్యోక్చ నూర్యం దృశే - య ఉదగాన్మహతో 2 ర్ణవాత్ త్రిగుణాత్మకమైన ఈ సంసార మనే తమస్సు కతీతంగా వెలిగే ఆ దివ్య చైతన్య జ్యోతిస్సు నందు కోటానికి.
అదే మనమే అవస్థలో ఉన్నా కాయికంగా ఎంత అపవిత్రులమైనా - మనలను మానసికంగా పరిశుద్ధులను చేస్తుంది. ఆ భావనమే మనకు పావనం. ఆ భావన వదలకుండా మనమే సౌర తేజస్సును ప్రార్ధించినా ఏ అర్ఘ్య జల మర్పించినా ఏ జలాన్ని మనమీద ప్రోక్షణ చేసుకొన్నా ఏ అంగన్యాస కరస్యాసాదు లను ష్ఠించినా ఏ ద్యావాపృధ్వులను స్తుతించినా ఏ శివకేశవులను స్మరించినా కడకు ఏ దిగ్దేవతలకు మన తాలూకు ప్రవర చెప్పుకొన్నా - నమోవాకా లర్పించినా అదంతా ఆయా ఉపాధులలో ప్రకాశించే స్వ ప్రకాశమైన బ్రహ్మ తత్త్వాన్నే చూపుతుంది. అప్పుడంతా కలిసి ఏకైకమైన పరమాత్మ స్వరూపమేననే అఖండాను భవ మేర్పడుతుంది. ఈ అఖండ భావనతో చేసిన కర్మ కర్మ గాదు. అది జ్ఞానమే. త్రికరణ వ్యాపారాలన్నీ దానికి సమర్పయామి అని నిత్యమూ భావించినప్పుడే మనం చేసే సంధ్యావందనం బ్రహ్మ కర్మ అవుతుంది. బ్రహ్మ కర్మ బ్రహ్మ జ్ఞానమిస్తుంది అదే పరమ పురుషార్ధం మానవుడికి అది మనల నెప్పటికైనా తరింప జేస్తుంది.
Page 156