#


Index

   సర్వవ్యాపకం గనుక అది తనలోనే వాటిని కలుపుకొంటుంది. అప్పు డవిద్య మనకు విద్యగా మారి తోడ్పడుతుంది. ఇదే ప్రతిలోమమంటే. అనులోమం అవిద్యా మూలమైన సృష్టి అయితే ప్రతిలోమం విద్యా నిమిత్తమైన లయం. ఆపోజ్యోతీరసో 2 మృతం బ్రహ్మ. అప్పుడు క్రమంగా ఈ జీవుడు శరీర మనోవృత్తి వాసనా కలాపమంతా దాటి జ్ఞాన బలంతో తన స్వరూపమైన బ్రహ్మ భావాన్ని అందుకోగలడు. ఇంత లోతైన పరమార్ధం గుప్తమయి ఉందీ గాయత్రీ మంత్రంలో. మననం చేసే కొద్దీ బయట పడుతుందది మనకు. గాయత్రీ అంటే గానం చేస్తూ దిగి వచ్చిందది అవిద్యా రూపంగా. మరలా అదే గానం చేస్తూ పైకి తీసుకెళ్లుతుంది విద్యారూపంగా. విద్యా విద్యా స్వరూపిణి ఆ శక్తి. విద్యా రూపంగా స్వరూప స్థితిలో ఏకమై ఉంటుంది. అదే అవిద్యా రూపంగా అనేకంగా మారి కనిపిస్తుంది. స్వరూపంగా నిరుపాధికం. అది విస్తరిస్తే సోపాధికం. ఆ ఉపాధులే తేజోబన్నాలు. తదస్యరూపం ప్రతి చక్షణాయ అన్నారు. ఈ ఉపాధులన్నీ దాన్ని చేర్చటానికే. అందుకే ఈ సూర్యోపాసనా. ఈ వరుణోపాసనా. ఈ పృథ్వీ దేవతో పాసనా. సంధ్యా వందన ప్రక్రియ అంతా మొదటి నుంచీ చివరిదాకా ఈ మూడింటితోనే గదా సాగటం. అది వీటితోనే కాలక్షేపం చేయటానికి కాదు. వీటి ద్వారా వీటికి మూలమైన పరమార్ధమేదో దాన్ని అందుకోటానికి. అందుకోసమే జీవేమ శరద శృతం. దీర్ఘకాలం బ్రతకాలి మనం. పశ్యేమ శరద శ్శతం శృణ వామ శరద శ్శతం. ప్రబ్రవామ శరదశ్శతం. ఇంద్రియ శక్తులన్నీ పని చేయాలి.

Page 155